40.2 C
Hyderabad
May 2, 2024 15: 48 PM
Slider నిజామాబాద్

ఆఫీసు బీరువాలా.. రోడ్లపై గోడలా.. ?

#kama

అందరికి ఆదర్శంగా ఉండే కార్యాలయం అది. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థులను ప్రయోజకులుగా మార్చే ఉపాధ్యాయులకు సంబందించిన కార్యాలయం. కానీ రహదారిపై ఉన్న గోడలకు తలదన్నేలా కార్యాలయంలో స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. దాంతో ఇవి ఆఫీసు బీరువాలా.. లేకా బయట గోడలా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి ఆ కార్యాలయంలో నెలకొంది. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయం అది. ఆ కార్యాలయంలో వివిధ విభాగాల వారిగా వారికి ప్రత్యేకంగా బీరువాలు ఉన్నాయి.

బీరువాలలో సంబంధిత విభాగాలకు సంబందించిన ముఖ్యమైన రికార్డులు అందులో భద్రపరుచుకుంటారు. అయితే అందులో ముఖ్యమైన రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు కాని బీరువాల తలుపులకు మాత్రం ఉపాధ్యాయ సంఘాలకు సంబందించిన ప్రకటనలు, క్యాలెండర్లు, ఇతర స్టిక్కర్లు మాత్రం పుష్కలంగా అతికించి ఉన్నాయి. బయట నుంచి ఆఫీసులో అడుగు పెట్టగానే ఈ స్టిక్కర్లే దర్శనమిస్తున్నాయి. అధికారులు కూర్చునే స్థానాల పక్కనే బీరువాలు ఉండటంతో ఇదంతా అధికారులకు పట్టడం లేదా.. లేక మన శాఖకు సంబంధించిన స్టిక్కర్లే కదా అని ఉరుకుటుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యాశాఖ అధికారి సైతం ఈ స్టిక్కర్లను అతికించడంపై ఉదాసీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల పెత్తనమే కార్యాలయంలో నడుస్తుందన్న అపవాదు మూటగట్టుకున్న ఆ శాఖ ఇప్పుడు ఆ సంఘాల నాయకులను స్టిక్కర్లు ఇలా అతికిస్తే ఎలా అని ప్రశ్నించే సాహసం చేస్తారా అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆ శాఖలో పోటాపోటీగా స్టిక్జర్లు అతికించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

ఘనంగా కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

వెరీ స్ట్రిక్ట్ :మహిళ వేధింపులపై కఠినం గా వ్యవహరిస్తాం

Satyam NEWS

విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

Satyam NEWS

Leave a Comment