29.7 C
Hyderabad
May 3, 2024 04: 21 AM
Slider ప్రత్యేకం

Corona Update: మహారాష్ట్ర తరువాతి స్థానానికి ఆంధ్రప్రదేశ్

#CoronaVaccine

ఏపీలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. మహారాష్ట్ర తరువాత రెండు స్థానంలో ఏపీ నిలిచింది. మరణాల్లో మహారాష్ట్ర, తమిళనాడు,ఢిల్లీ, తరువాత ఏపీ నాలుగో స్థానం లో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోమరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, 10,603 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది. తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది.

రాష్ట్రంలో నేటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, ఇంకా 99,129 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా టెస్టులు యూపీ 53 లక్షలు, తమిళనాడు  46.5 లక్షలు, మహారాష్ట్ర 40.9 లక్షలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో 36 లక్షలు చేసి 4 వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 13.3 లక్షలు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

Related posts

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా  పుట్ట పాక మహేష్   

Satyam NEWS

అరుదైన శస్త్ర చికిత్సలో భారీ కణితి తొలగింపు

Satyam NEWS

ఈడ్పుగంటి పద్మజారాణి పంచాంగం: సత్యం న్యూస్ ప్రత్యేకం(వీడియో)

Satyam NEWS

Leave a Comment