41.2 C
Hyderabad
May 4, 2024 17: 54 PM
Slider ప్రపంచం

డెంగ్యూ వచ్చిన దేశాలలో కరోనా వ్యాప్తి తక్కువే

#CoronavirusandDengue

కరోనా వైరస్ కు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో డెంగ్యూ వ్యాధి ప్రబలిన దేశాలలో కరోనా పెద్దగా ప్రభావం చూపించడం లేదని తాజా పరిశోధనలో తేలింది.

కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందిన బ్రెజిల్ లో జరిపిన పరిశోధనలలో గతంలో డెంగ్యూ జ్వరం సోకిన వారికి కరోనా రావడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది.

దోమలు కుట్టడం కారణంగా వచ్చే వ్యాధులు ప్రబలంగా ఉన్న దేశాలలో కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని కూడా వెల్లడించారు.

అయితే ఈ పరిశోధన వివరాలను ఇంకా అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో ప్రచురితం కాలేదు. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మిగుల్ కొనోలీల్స్ ఈ పరిశోధన చేశారు.

2019 – 2020 సంవత్సరంలో డెంగ్యూ వ్యాధి ప్రబలిన దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి పై విశ్లేషణ చేయడం ఆయన పరిశోధన లో ముఖ్యాంశం.

డెంగ్యూ ప్రబలిన దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత నెమ్మదిగా జరుగుతున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన అంశాలపై మరింతగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ మిగుల్ కొనోలీల్స్ అభిప్రాయపడ్డారు.

లాటిన్ అమెరికా, ఆసియా దేశాలలో డెంగ్యూ విశేషంగా వ్యాప్తి చెందింది. ఆ దేశాలలో కరోనా వ్యాప్తి అంతగా వ్యాప్తి చెందలేదనేది ఆయన పరిశోధన సారాంశం.

Related posts

అనూష హత్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరా

Satyam NEWS

సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు ముమ్మ‌రం..

Sub Editor

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచిన మేడా

Satyam NEWS

Leave a Comment