33.7 C
Hyderabad
April 30, 2024 00: 09 AM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

#HyderabadRoads

హైదరాబాద్‌-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారు ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు. దీనికి బదులు సెవెన్‌ టోంబ్స్‌ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు.

పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్‌ నుంచి మళ్లిస్తున్నారు. మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ బ్లాక్‌ అయ్యింది. ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు. మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.

కోతకు గురైన జాతీయ రహదారి

అప్పాచెరువు కట్ట తెగడంతో వచ్చిన వరదకు గగన్‌పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవే కోతకు గురైంది. దీంతో కార్లు, లారీలు కొట్టుకుపోయి.. పలువురు ప్రజలు కూడా గల్లంతయ్యారు.

ఇప్పటివరకు మట్టిపూడికలో పలు కార్లు, 3 మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రాకపోకలు నిషేధించగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కర్నూలుకు వెళ్లేవారు వేరే మార్గాన్ని ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

Related posts

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

చేనేత కార్మికులను పాలకులు ఆదుకోవాలి

Satyam NEWS

చెంచు గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment