31.7 C
Hyderabad
May 2, 2024 07: 51 AM
Slider ముఖ్యంశాలు

కటిక దరిద్రం అనుభవిస్తున్నాయా ఈ కార్పొరేట్ కాలేజీలు?

#Corporate College

కరోనా పేరుతో కార్పొరేట్ కాలేజీలు సిబ్బందికి చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉన్నా రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. విద్యా వ్యాపారంలో కోట్లాది రూపాయలు ఆర్జించిన రెండు ప్రధాన కార్పొరేట్ విద్యా వ్యవస్థలు టీచర్లను తీసేయడానికి పెద్ద పెద్ద ప్లాన్ లే వేస్తున్నాయి.

టీచర్లకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నా ఆ రెండు కార్పొరేట్ కాలేజీలూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ రెండు కార్పొరేట్ విద్యా సంస్థలూ విద్యార్ధులను ఏ విధంగా కాపాడుకోవాలి? కరోనా తర్వాత వారికి భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు ఎలా నేర్పాలి అనే అంశాలపై కాకుండా టీచర్లను ఏ విధంగా తీసేయాలి? ఒక వేళ వారు కోర్టుకు వెళితే ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపినట్లుగా కనిపిస్తున్నది.

విద్యార్ధుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఫీజుల కోసం పీక్కుతునే ఈ రెండు విద్యా సంస్థలు విద్యా వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత వందల కోట్లలో సంపాదించి ఉంటాయి. కేవలం 40 రోజుల పాటు లాక్ డౌన్ రాగానే సిబ్బందిని తీసేసేందుకు ముందుకు వచ్చాయి.

మరీ ఎంత దరిద్రంలో ఈ రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయంటే అటెండర్లు, స్వీపర్లు, బస్సు డైవర్లకు కూడా గత రెండు నెలల జీతాలు ఎగ్గొట్టాయి. బోధనా సిబ్బందికి ఏప్రిల్ నెల జీతం ఇంకా ఇవ్వలేదు. జీతం అడిగిన వారిని తీసేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఇదే విధంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఈ రెండు ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలలోని బోధన, బోధనేతర సిబ్బంది అలో లక్ష్మణా అంటూ రోడ్డున పడాల్సి వస్తుంది.

Related posts

కచ్చితంగా ఇక నుంచి మాస్కులు ధరించాల్సిందే

Satyam NEWS

షర్మిల ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం అబ్జర్వర్ గా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి

Satyam NEWS

ములుగులో మడుగూరి నాగేశ్వర్ రావుకు సన్మానం

Satyam NEWS

Leave a Comment