28.2 C
Hyderabad
May 9, 2024 01: 55 AM
Slider హైదరాబాద్

మల్లాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ పర్యటన

#mallapur

రోడ్లపై పేరుకుపోయిన ఇసుక, మట్టి ని వెంటనే తొలగించాలి: కార్పొరేటర్  పన్నాల

రెండు రోజుల ధాటికి కొట్టుకొచ్చిన మట్టిని త్వరితగతిన తొలగించాలనీ  కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గత రెండు రోజుల క్రితం మల్లాపూర్ లో కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ఇసుక, మట్టి లోతట్టు ప్రాంతాల రోడ్లపై పై పేరుకుపోయి  ప్రజలకు అసౌకర్యంగా వుంటుందనీ ఇసుక కుప్పలను వెంటనే  తొలగించాలని జిహెచ్ఎంసి అధికారులు కు  సూచించారు.  మంగళవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్, న్యూ భవాని నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పర్యటించారు. అనంతరం  దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెనువెంటనే మట్టి, ఇసుక ను తొలగించాలని అన్నారు. సకాలంలో అధికారులు స్పందించి జలమయమైన కాలనీలలో నీ వరద నీటిని, గత రెండు రోజులుగా సాఫీగా వెళ్లేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవాని నగర్ లో డ్రైనేజీ బాక్స్ కల్వర్ట్ పూర్తయిన వెంటనే సి సి రోడ్డు వేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి అధికారులు లోతట్టు ప్రాంతాలలో పేరుకుపోయిన ఇసుకను, మట్టి కుప్పలు ను తొలగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ. రూప, వర్క్ ఇన్స్పెక్టర్లు బిక్షపతి, రమేష్, టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ గౌడ్ ,స్థానిక కాలనీవాసులు ధర్మారెడ్డి, శ్రీశైలం, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కుడికిల్ల రైతుల భూములకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలి

Satyam NEWS

ఎస్‌సి,ఎస్‌టి ల అభివృద్దికి ప్రత్యేక నిధులు

Murali Krishna

ప్రతి టీచర్ పది మంది స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకుంటే సరి

Satyam NEWS

Leave a Comment