28.7 C
Hyderabad
May 5, 2024 07: 39 AM
Slider విజయనగరం

చౌడవాడ ఘటన పునరావృతం కాకుండా చూడండి..

#Vijayanagaram S P

ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పోలింగ్ లో సిబ్బంది కనబర్చిన రీతిలోనే నాల్గో దశ చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా విధులు నిర్వహించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తెలిపారు.

జిల్లా కేంద్రంలో ని పరేడ్ గ్రౌండ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు సిబ్బంది నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు.మూడో విడత పోలింగ్ లో పూసపాటిరేగ మండలం చౌడవాడ ఘటనలో కానిస్టేబుల్ అలెర్ట్ అయి పోలీసు శాఖ… సాక్షాత్తు ఎలక్షన్ కమీషనర్ మెచ్చుకునే విధంగా వ్యవహించారని ౠస్పీ పేర్కొన్నారు.

ఆ విధంగా ఈ నాల్గో విడత ఆఖరి దశ పోలింగ్ సందర్భంగా సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. పోలింగ్ పూర్తయినా..అక్కడే సిబ్బంది ఉండే విధంగా సంబంధిత పోలీసులు వ్యవహరించాలన్నారు.

పోలింగ్ పూర్తయిన వెంటనే 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఈసారి స్ట్రైకింగ్ ఫోర్స్… సమస్యాత్మక ప్రాంతాల్లో ఆ ఫోర్స్ సమాచారాన్ని సేకరించేలా వ్యవహరించాలన్నారు.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించినా మూడో విడత పోలింగ్ లో సాధారణ ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈ ఆఖరి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను సమర్ధవంతంగా నిర్వహించాలని ఎస్పీ. సిబ్బంది ని కోరారు.

అంతకుముందు అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. ఈ సమావేశంలో పోలీసులు అధికారులు… మోహనరావు, శేషాద్రి, అనిల్ ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్

Related posts

ప్రొఫెసర్ కోదండరామ్ విజయమే మన ధ్యేయం

Satyam NEWS

సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇక్షు’ మూవీ రిలీజ్

Satyam NEWS

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment