33.7 C
Hyderabad
April 27, 2024 23: 16 PM
Slider ఖమ్మం రంగారెడ్డి

మంత్రి పువ్వాడ ఏరియల్ సర్వే

#Mantri Puvvada

ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి చుట్టుపక్కల పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వం ఎర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఏరియల్ సర్వే భద్రాచలం నుండి చర్ల వరకున్న గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగింది. చర్ల గ్రామంలో దిగి అక్కడ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం జీపీ పల్లి లో గల పునరావాస కేంద్రంలో బాధితులను కలిసి వారితో మాట్లాడి, అక్కడ అందుతున్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సర్వేలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను మంత్రి పువ్వాడ నేరుగా పర్యవేక్షించారు.ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిన్నారు.

Related posts

శ్రమజీవుల హక్కులను హరిస్తే చరిత్రలో హీనంగా మిగులుతారు

Satyam NEWS

సీఎం జగన్ రెడ్డి తో తమ్ముడు అవినాష్ రెడ్డి భేటీ

Satyam NEWS

తీన్మార్ మల్లన్నను కలిసిన ములుగు జిల్లా సభ్యుడు శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment