38.2 C
Hyderabad
April 29, 2024 12: 17 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా గుర్రం జాషువా 50వ వర్ధంతి

#gurram jashuva

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో శనివారం గుర్రం జాషువా 50వ, వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

బయ్యారపు రాఘవరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత వేల్పుల మోష,మీసాల శరత్ బాబు హాజరై జాషువా గురించి ప్రసంగించారు.తె లుగు ఆధునిక కవులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహా కవి గుర్రం జాషువా అని అన్నారు.

1928-1942 వరుకు గుంటూరు లోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారని,రెండవ ప్రపంచ యుద్ద కాలంలో యుద్ద ప్రచారకుడిగా పనిచేశారని,తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కు గండపెండెరం తొడిగి సత్కరించారని గుర్తు చేశారు.

నవయుగ చక్రవర్తి,కవితా విశారద, కళాప్రపూర్ణ,విశ్వకవి సామ్రాట్ గా ప్రఖ్యాతి గడించిన జాషువాను కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గౌరవించి సత్కరించారని,1964వ,సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యులైనారని అన్నారు.

జాషువా రచించిన పద్యాలను మోష రాగయుక్తంగా ఆలపించటంతో పలువురిని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో బయ్యారపు రవీందర్,ఎం జె ఎఫ్ అధ్యక్షుడు జగజ్జీవన్,ప్రధాన కార్యదర్శి వగ్గు విశాఖ, జాషువా కమిటీ కార్యదర్శి గల్ల వేంకటేశ్వర్లు,గుండెపంగు సైదులు(కృష్ణ),మెరిగ సైదులు,మట్టపల్లి, నాగేందర్,రెమిడాల విజయ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బాధితుల కుటుంబాలకు ఐడీ నెంబర్లు కేటాయించండి

Satyam NEWS

పత్రికా స్వేచ్ఛ హరించిన కల్వకుర్తి ఎస్ఐపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

ఫొటో ఫినిష్: కౌన్సిల్ రద్దు విధానం ఇది

Satyam NEWS

Leave a Comment