27.7 C
Hyderabad
May 7, 2024 10: 12 AM
Slider నల్గొండ

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి మానవత్వంతో ఆదుకోవాలి

#Roshapati

ప్రపంచంలో మానవాళికి ఎన్నడూ రాని కష్టాలు కరోనా తో ఉపద్రవం వచ్చిందని, ఆర్థికంగా ఉన్న వారు, పారిశ్రామికవేత్తలు పనులు దొరక్క ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయంలో పనులు దొరకక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు అందించిన పిదప రోషపతి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న  సి ఐ టి యు అనుబంధ కార్మిక సంఘాలలో ఉన్నవారికి ఉడతా భక్తిగా సహకరిస్తున్నామని, దీనికి తోడు ఉద్యోగులు,ఆర్థికంగా స్థిరపడిన వారు తమకు తోచిన విధంగా అర్హులైన  మీ ప్రాంతంలో ఉన్న వారికి సహకరించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు గుండెబోయిన వెంకన్న, కోటేశ్వరరావు, చింతకాయల పర్వతాలు, కొండపల్లి వెంకన్న, కనకయ్య, దిన కూలీల అధ్యక్షురాలు సాముల కోటమ్మ, గోపమ్మ, రామారావు, ఎల్లప్ప, ధనమూర్తి, రాములు, రామయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వినాయక నిమజ్జనం

Satyam NEWS

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

Satyam NEWS

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

Satyam NEWS

Leave a Comment