31.2 C
Hyderabad
May 3, 2024 00: 56 AM
Slider జాతీయం

కోవాక్సిన్ కు వ్యతిరేక ఆర్టికల్స్ తొలగించాలని ది వైర్ కు ఆదేశం

#thewire

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన కోవాక్సిన్‌ కు వ్యతిరేకంగా ప్రచురించిన ఆర్టికల్స్ ను తక్షణమే తీసేయాలని ది వైర్‌ వెబ్ సైట్ ను రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జి ఆదేశించారు. ది వైర్ వెబ్ సైట్ మొత్తం 14 ఆర్టికల్స్ ను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ కు వ్యతిరేకంగా పోస్టు చేసింది. పనిగట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని భారత్ బయోటెక్ కంపెనీ ది వైర్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది.

ది వైర్, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం ప్రచురణకర్త, దాని సంపాదకులు సిద్ధార్థ్ వరదరాజన్, సిద్ధార్థ్ రోషన్‌లాల్ భాటియా, ఎంకె వేణు భారత్ బయోటెక్, కోవాక్సిన్‌లకు వ్యతిరేకంగా కథనాలు రాసిన మరో తొమ్మిది మందిపై దావా దాఖలైంది.

భారత్ బయోటెక్ తరఫు సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదిస్తూ, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతో భారత్ బయోటెక్, కోవాక్సిన్‌లపై తప్పుడు ఆరోపణలతో కూడిన కథనాలను ది వైర్ ప్రచురించిందని తెలిపారు. భారత్ బయోటెక్ గతంలో క్షయ, జికా రోటావైరస్, చికున్‌గున్యా, టైఫాయిడ్‌లకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసిందని, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రముఖ భారత ప్రభుత్వ సంస్థలతో సహకరించిందని రెడ్డి వాదించారు.

సరైన వాస్తవాలను చూడకుండానే వ్యాక్సిన్ పనితీరుపైనా, అనుమతులపైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ది వైర్ అనేక కథనాలను ప్రచురించిందని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత, వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కూడా, ది వైర్‌లో కథనాలు ప్రచురించబడుతూనే ఉన్నాయని కోర్టు పేర్కొంది.

ఇలాంటి కథనాల వల్ల వ్యాక్సిన్ పై అపోహలు తలెత్తాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల వెబ్‌సైట్ నుండి పరువు నష్టం కలిగించే కథనాలను 48 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. భారత్ బయోటెక్, దాని ఉత్పత్తి అయిన COVAXIN గురించి ఎటువంటి పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించకుండా ది వైర్‌ను కోర్టు నిరోధించింది.

Related posts

యువరాజు కేటీఆర్ రాక… పోలీసుల ఓవర్ యాక్షన్

Satyam NEWS

ఉప్పల్ సమస్యలు పరిష్కరించండి

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment