28.7 C
Hyderabad
April 28, 2024 04: 45 AM
Slider సంపాదకీయం

ఆంక్షలు… అడ్డంకులు… భీమ్లా నాయక్ ను ఆపగలవా?

#pawankalyan

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి తెలంగాణ మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అతి దారుణంగా ఆ చిత్రానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెలంగాణ లో ఐదు షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలు అందరికి అనువుగా ఉన్నాయి.

అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే భీమ్లా నాయక్ సినిమా విడుదల కాబోతున్న థియేటర్లకు అప్పుడే వేధింపులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వంలో పెద్దలు నేరుగా ఆదేశాలు ఇస్తున్నట్లు దాఖలాలు లేవు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కచ్చితంగా ‘‘పై నుంచి’’ ఆదేశాలు వచ్చినట్లే కనిపిస్తున్నది.

కింది స్థాయి అధికారులు తమ తమ స్థాయిలోనే థియేటర్ యజమానులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా నిబంధనలు అతిక్రమించరాదని, అలా చేసినట్లు అనుమానం వస్తే థియేటర్లను సీజ్ చేస్తామని కింది స్థాయి అధికారులు మౌఖికంగా చెబుతున్నారు.

భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోవడంతోనే తమ రాజకీయ అవసరాలు తీరతాయని ఎవరు అనుకుంటున్నారో కానీ ఇలా చేయడం ద్వారా పవన్ కల్యాణ్ పట్ల ఆయన అభిమానులకే కాకుండా సాధారణ ప్రజల నుంచి కూడా సానుభూతి వచ్చే విధంగా చేస్తున్నారు.

ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ గురించి ఆలోచించని వారిని కూడా ఆయన పట్ల సానుభూతితో ఆలోచించే విధంగా చేస్తున్నారు. ‘‘శుభం కార్డు’’ పడ్డదని చిరంజీవి చెప్పినా కూడా టిక్కెట్ ధరలపై ఇంకా శుభం కార్డును జగన్ ప్రభుత్వం వేయలేదు. బహుశ భీమ్లానాయక్ సినిమా విడుదల తేదీ కోసం వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

భీమ్లా నాయక్ చిత్రం విడుదల అయిన తర్వాత… భీమ్లా నాయక్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు నష్ట పోయిన తర్వాత చిరంజీవి చెప్పినట్లు టిక్కెట్ ధరలకు జగన్ ప్రభుత్వం ‘‘శుభం కార్డు’’ వేయవచ్చు. అయితే పవన్ కల్యాణ్ ఏ మాత్రం తగ్గకుండా తన సినిమాను విడుదల చేస్తున్నారు.

కోస్తా ఆంధ్రా, రాయలసీమ సినిమాకు పెద్ద మార్కెట్ తెలంగాణ కేవలం 35 శాతం మార్కెట్ ఉంటే 65 శాతం అక్కడ ఉంటుంది. ఈ కీలక అంశాన్ని ఉపయోగించుకుని సినీ పరిశ్రమను తన దారికి తెచ్చుకోవాలని అక్కడి పాలకులు భావించారు.

అందుకోసం సినిమా టిక్కెట్ ధరలను అమాంతం తగ్గించారు. ధియేటర్లు నిబంధనలు పాటించడం లేదంటూ మాసివేయించారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. 25వ తేదీన భీమ్లా నాయక్ రాబోతున్నది.

ఈ లోపునే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నది. సినిమా టిక్కెట్ల రేటు పెంచితే, సినిమా ఎక్కువ షోలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఎక్కువగా పన్ను వసూలు అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆ ఆదాయం పెద్ద లెక్కలోకి రాదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది.

టిక్కెట్ ధరలను పెంచాలని చిరంజీవి దణ్ణం పెట్టి అడిగినట్లు తాను అడగలేనని ఇప్పటికే పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. చిరంజీవి ఇతర నటుల రాయబారం ఫలించే వరకూ ఆగకుండా భీమ్లా నాయక్ చిత్రాన్ని విడుదల చేసేందుకు పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడంతోనే తొలి విజయం అందుకున్నారు.

భీమ్లా నాయక్ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తూ ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఘన విజయం సాధించే దిశగానే వెళుతున్నది. అదే జరిగితే పవన్ కల్యాణ్ దే అంతిమ విజయం అవుతుంది. టిక్కెట్ ధరలు తగ్గి ఉన్నప్పుడే ఘన విజయం సాధించింది నందమూరి బాలకృష్ణ చిత్రం అఖండ.

ఇప్పుడు భీమ్లా నాయక్ కూడా ఘన విజయం సాధిస్తే ఇక ప్రభుత్వ నిబంధనలు పట్టించుకునే నాథుడు ఉండడు. 65 శాతం ఏపి మార్కెట్ కు ఆల్టర్నేట్ మార్కెట్ వైపు గా తెలుగు చిత్ర పరిశ్రమ వెళ్లిపోతుంది. ఆల్ ద బెస్ట్ టు భీమ్లా నాయక్.

Related posts

పాకిస్తాన్ కు అమెరికా భారత్ సంయుక్త గ్రూప్ హెచ్చరిక

Satyam NEWS

ఫోర్బ్స్‌అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలసీతారామన్‌

Sub Editor

ఘనంగా మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి

Satyam NEWS

Leave a Comment