ఉత్తర కొరియాలో కొవిడ్-19 సోకిందన్న అనుమానంతో పొలిసు అధికారులు ఓ వ్యక్తిని కాల్చి చంపారు. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన అతనికి బయటకు ఎక్కడికీ వెళ్లొద్దని నిబంధనలు విధించారు. అయితే సదరు వ్యక్తి ఆ నిబంధనలు ఉల్లంగిచడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, వెంటనే కాల్చి పారేశారు. అయితే వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు.