29.7 C
Hyderabad
April 29, 2024 09: 18 AM
Slider హైదరాబాద్

బెస్ట్ హ్యూమానిటీ అవార్డు అందుకున్న హుజూర్ నగర్ వాసి

#SajjanarIPS

హుజూర్ నగర్ వాసి బాజి సైబరాబాద్ సి పి సజ్జనార్ చేతుల మీదుగా బెస్ట్ హ్యూమానిటీ అవార్డు అందుకున్నారు. కరోనా విపత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన బాజి వృత్తిరీత్యా ప్రయివేటు కారు డ్రైవర్. తాను స్థాపించిన ‘బ్రతుకు బ్రతికించు’ ఫౌండేషన్ ద్వారా తాను సంపాదించిన సొంత ఖర్చులతో కరోనా సోకి చనిపోయిన 206 మందికి అంత్యక్రియలు నిర్వహించాడు. 

కరోనా విపత్తులో ఎన్నో సేవలు చేస్తూ, పేద కుటుంబాల వారికి బియ్యం,నిత్యావసర సరుకులు, బట్టలను ఫౌండేషన్ ద్వారా అందజేశాడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏన్నో సేవలు అందజేశాడు. 

బాజీ చేసిన సేవలను గుర్తించిన సి పి సజ్జనార్ చేతులమీదుగా సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో బాజి కి ‘ది బెస్ట్ హ్యూమానిటి’ అవార్డును శనివారం ఉదయం 11 గంటలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనరేట్ కార్యాలయ సిబ్బంది, ‘బ్రతుకు బ్రతికించు’ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వైరస్:చైనాలో కోవిడ్-19తో ఆసుపత్రి డైరెక్టర్ మృతి

Satyam NEWS

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే

Satyam NEWS

విజయనగరం మేయర్ గా ఆశపు సుజాత..?

Satyam NEWS

Leave a Comment