యూదులకు సహకరిస్తున్నరనే ఆరోపణలతో ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న వెస్ట్ బ్యాంక్‌లోని 112 కంపెనీలపైన ఐక్యరాజ్య సమితి హక్కుల సంస్థ హై కమిషనర్ నిషేధం విధిస్తూ వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ఇందుకు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ స్పందిస్తూ హక్కుల కమిషన్ కార్యాలయంతో సంబంధాలను తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెస్ట్ బ్యాంకులోని యూదు స్థావరాల ప్రజలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోరాదని హక్కుల కమిషన్ నిషేధం పెట్టినట్టుగా ఇజ్రాయిల్ టైమ్స్ తెలిపింది.
మానవ హక్కుల పరిశీలన సంస్థ విధించిన ఈ నిషేధాన్ని పాలస్తీనా ప్రజలు ఆహ్వానించారు. ఇజ్రాయిల్‌పైన ఒత్తిడి చేసేందుకు అనేక దేశాలు తిరస్కరిస్తున్నాయని మానవ హక్కుల సంస్థ కమీషనర్ ప్రకటించారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిల్‌ను మొదటి నుంచి ఐరాసా హక్కుల సంస్థ వ్యతిరేకిస్తూనే ఉన్నది.