29.7 C
Hyderabad
May 3, 2024 04: 59 AM
Slider హైదరాబాద్

నిర్విరామంగా పని చేస్తున్న హైదరాబాద్ కోవిడ్ కాల్ సెంటర్

#Covid Call Center

కోవిడ్ తో ప్రపంచ వ్యాప్తం గా పోరాడుతున్న వేళ తెలంగాణ  ప్రభుత్వం కోవిడ్ కష్ట కాలం లో  ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య వంతులను  చేసేందుకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంది.

ఈ కాల్ సెంటర్ ద్వార కోవిడ్ పాజిటివ్ రోగులకు ఇంటి వద్దే వుంటూ  హోం ఇసోలేషన్ లో  భాగంగా తీసుకోవలసిన చర్యలు గూర్చి కౌన్సిలింగ్ ద్వారా తెలియ చేస్తుంది. సాధారణ పరిస్థితులలో  రోజు వారిగా 17 రోజుల పాటు  కాల్ సెంటర్ నుండి నిపుణులు ఫాలో అప్ చేస్తున్నారు.

మైల్డ్ లక్షణాలు వున్నా వారికీ  టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు . కాల్ సెంటర్ సిబ్బంది రెండు విడతలలో సుమారు 200 మంది కాల్లెర్స్ తో నిరంతరాయంగా పనిచేస్తుంది. హోం ఇసోలేషన్లో  వున్నా  సుమారు  పది వేల మంది  కోవిడ్  రోగులు తీసుకోవలసిన జాగ్రతలు, సమతూల్య ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలుసుకోవడమే కాకుండా సలహా లు, సూచనలు చేస్తున్నారు.

ప్రతి రోజు సుమారు ఐదు వందల మంది రోగులకు  ప్రాధాన్యత  ఆధారంగా టెలి మెడిసిన్  ద్వార వైద్య సలహాలు అందజేస్తున్నారు. ఎవరైనా కోవిడ్ బాధితులు  తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్య లేదా ఛాతి నొప్పి తో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య  సౌకర్యం  అందించేందుకు ఆసుపత్రి కి తరలిస్తారు.

కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ – 18005994455 కు హోం ఇసోలేషన్ లో రోగి తో పాటు రోగికి సేవలు అందించేవారు తీసుకోవలసిన జాగ్రతల పై సూచనలు చేస్తారు. కోవిడ్ కు సంబంధించి ఏమైనా సూచనలు , సలహాలు  తెలుసుకోవాలి అనుకునేవారు  కోవిడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Related posts

అనారోగ్యంతో వచ్చి ఆర్టీసీ బస్సులోనే ఆగిన శ్వాస

Satyam NEWS

అత్యాచార బాధితులకు ఆర్ధిక సాయం

Satyam NEWS

సేఫ్టీ ఫస్ట్: గ‌నుల‌లో భ‌ద్ర‌త పై స‌మావేశం

Satyam NEWS

Leave a Comment