40.2 C
Hyderabad
April 29, 2024 18: 38 PM
Slider ముఖ్యంశాలు

నాణ్యమైన, మన్నికైన ఔషదాలను ప్రజలకు అందించాలి

#medicalshop

నాణ్యమైన ,మన్నికైన ఔషదాలును ప్రజలకు అందించాలని,  వ్యాపార రంగంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చిల్కానగర్ చౌరస్తాలోని   గురువారం  కార్తీక మెడికల్‌ అండ్ జనరల్ స్టోర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడతూ నాణ్యమైన ,మన్నికైన ఔషదాలు ప్రజలకు అందించాలని తెలిపారు. వ్యాపార రంగంలో బాగా రాణించాలని,  దానితో పాటు  సమాజానికి కొంత పర్సంటేజి  ఇవ్వాలన్నారు.

ఈ ప్రాంతంలో కార్తీక  మెడికల్‌ అండ్ జనరల్ స్టోర్  అందుబాటులోకి  రావడం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్వహకులు  ఎం సిద్ధారెడ్డి  మాట్లాతూ మా మెడికల్‌ స్టోర్‌లో  నాణ్యమైన, మన్నికైన ఔషదాలు (మందులు) దొరుకుతాయని,  ఔషదాల  కొనుగోలు పై 10% నుండి 20% డిస్కౌంటు తో పాటు  ప్రీ హోమ్ డెలవరీ ఇస్తున్నామని ఈ సదవకాశాన్ని  ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మా మెడికల్ షాప్ నందు సిద్విక్ క్లీనిక్ ను నిర్వహిస్తున్నామని, గుండెకు సంబంధించిన వ్యాధులకు  ఒక వారము ఫ్రీ చెకప్ చేయబడునని తెలిపారు.

గుండెకు సంబంధించిన వ్యాధులకు సికింద్రాబాద్ లోని  సన్ షైన్ హాస్పిటల్ లో సీనియర్ కార్డియాలజిస్ట్  డా,, విజయ్ కుమార్ రెడ్డి, డా,, అనిల్ కుమార్ మూల్పూర్ చే శస్త్రచికిత్స, సర్జరీలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అధునాతన వైద్యం చేయిస్తామన్నారు. 20 సంవత్సరాల అనుభవం తో కార్తీక ఇక ఈ మెడికల్ అండ్  జెనరల్ స్టోర్ మరియు సిధ్విక్ క్లినిక్ స్థాపించటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఈ అవకాశాన్ని చిల్కానగర్ ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలో మన్నికైన మందులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు  పల్లె నర్సింగ్ రావు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, కొండల్ రెడ్డి గుడి మధుసూదన్ రెడ్డి, బింగి శ్రీను, శేఖర్, బాలు, కొంపల్లి రవీందర్ ముదిరాజ్, టీఆర్‌ఎస్‌నాయకలు , గరిక సుధాకర్‌, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మాస శేఖర్, జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి

Related posts

ఎంఎల్ సి ఎన్నికల్లో పల్లాకు అత్యధిక మెజార్టీని ఇవ్వండి

Satyam NEWS

డివోషన్: వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

Satyam NEWS

కేటీకే ఆరో గనిలో ప్రమాదం… ఇద్దరు కార్మికులు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment