40.2 C
Hyderabad
April 29, 2024 18: 21 PM
Slider వరంగల్

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

#mrps

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవమానకరంగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి అహంకారమని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశం నేడు ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది.

MRPS మండల నాయకుడు కనకం దాస్ మాదిగ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ(MSP) ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ రవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టి తెలంగాణ క్యాబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన  MRPS రాష్ట్ర కార్యదర్శి ములుగు నియోజకవర్గ ఇన్చార్జి నెమలి నర్సయ్య మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో దేశాలు చాలా గొప్పగా కొనియాడుతూ ఉంటే కేసీఆర్ మార్చాలనడం దేశ ప్రజలను అవమానించడమేనని వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 4న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో భారత రాజ్యాంగం పరిరక్షణ యుద్ధభేరి పేరుతో హైదరాబాదులో తలపెట్టిన బహిరంగ సభ కు లక్షలాది గా తరలి రావాలని ఆయన కోరారు. ఈనెల 11వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా హన్మకొండ పట్టణంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సదస్సు ను  జయప్రదం చేయాలని వారు కోరారు. దళిత,సామాజిక ప్రజాస్వామిక, పౌర, మానవ హక్కుల మేధావులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల భిక్షపతి గౌడ్, మహాజన సోషలిస్టు పార్టీ ఎటునాగారం సబ్ డివిజన్ ఇంచార్జ్ వావిలాల స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోడ రఘు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మహిళా నాయకురాలు బస్సు మమత ఓరుగంటి అనిల్ వావిలాల సాంబశివరావు, కాకి నరేష్, గుర్రం బాలరాజు, బద్రి లక్ష్మణ్ జన్ను జగ్జీవన్ రామ్. బుద్ధ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సినీనటులు

Satyam NEWS

దేవరకొండలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

Satyam NEWS

రామాలయ తొలి కమిటీ సమావేశం పలు తీర్మానాలు

Satyam NEWS

Leave a Comment