29.7 C
Hyderabad
May 7, 2024 07: 02 AM
Slider ముఖ్యంశాలు

మరో ధర్మాసనానికి సీఆర్‌డీఏ రద్దు చట్టంపై సుప్రీం విచారణ

#SupremeCourtofIndia

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

తాము ఇచ్చిన జీవోలు రాజ్యాంగపరమైనవా? కాదా? అనే అంశాలను పరిశీలించకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అయితే, ఈ పిటిషన్‌పై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ రోజు ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

అమ్మడానికి రాజావారు ఎవరూ? కొనడానికి చైర్ పర్సన్ భర్త ఎవరు?

Satyam NEWS

ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపిన కొలన్‌ శంకర్‌రెడ్డి

Satyam NEWS

కరోనా హెల్ప్: భాగ్యనగర్ కాలనీవాసుల ఉదార విరాళం

Satyam NEWS

Leave a Comment