40.2 C
Hyderabad
April 26, 2024 12: 14 PM
Slider ప్రపంచం

ఆంక్షలున్నా అందాల పోటీలు నిర్వహిస్తాం.. ఇజ్రాయెల్‌

ఆంక్షలు విధించినా, ‘మిస్‌ యూనివర్స్‌-2021’ పోటీలు జరిపి తీరుతామని ఇజ్రాయెల్‌ తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 12న ఐలాట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ అందాల పోటీలో పాల్గొనే అందరికీ ప్రతి 48 గంటలకు పీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే వైరస్‌కు సంబంధించి ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

దాదాపుగా 174 దేశాల్లో ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ ప్రసారం అవుతుందని, అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేమని స్పష్టం చేసింది. కాగా మలావి నుంచి వచ్చిన ఓ మహిళా టూరిస్ట్ కు ఓమిక్రాన్ వైరస్‌ సోకిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో విదేశీయులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది.

దేశంలో 14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్- ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్‌లో ఉ‍న్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్‌ దేశస్తులు కూడా క్వారంటైన్‌లో ఉండాలని, ఇంతకుముందు మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts

సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో సిరులతల్లి

Sub Editor

కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్ కు విముక్తి

Satyam NEWS

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS

Leave a Comment