31.7 C
Hyderabad
May 2, 2024 08: 02 AM
Slider కడప

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి

#kadapasteelfactory

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని మంగళవారం ఉదయం రాజంపేట తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ  తాసిల్దార్ కార్తీక్ కి  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి జి దినేష్ కుమార్ మాట్లాడుతూ  కడప జల్లాలోని జమ్మలమడుగు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో ఉక్కు పరిశ్రమకు శంఖుస్థాపన చేసి నిధుల కేటాయించకుండా మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఉత్తుతి హామీలు ఇచ్చారని, ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

ఉక్కు పరిశ్రమకు మొదట శంకుస్థాపన చేసి 15 సంవత్సరాలు అవుతున్న ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కాలేదన్నారు. తక్షణం ప్రభుత్వం నిధులు కేటాయించి ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలని తద్వారా రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని జిల్లాలో నిరుద్యో సమస్య పరిష్కారంతోపాటు వలసలు ఆగుతాయని కావున వెంటనే ఉక్కు పరిశ్రమ కు నిధులు కేటాయించి ఈ పనులు ప్రారంభించాలని వారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో  మొహమ్మద్, రవితేజ , సాయి రామ్, హరికృష్ణ, హరీ ప్రసాద్, రాజశేరరెడ్డి,సునీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హరీష్, హుజూరాబాద్ సరే పరిగిని అభివృద్ధి చేశారా?

Satyam NEWS

మహాత్మ పూలేకు నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS

అంధకారం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

Satyam NEWS

Leave a Comment