34.7 C
Hyderabad
May 5, 2024 01: 59 AM
Slider విజయనగరం

డివిజన్ సమగ్ర అభివృద్ధికి సీపీఎం అభ్యర్థి ప్రణాళిక విడుదల

#CPMVijayanagaram

33 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిస్తే డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సీపీఎం అభ్యర్థి రెడ్డి శంకరరావు ప్రజలకు వాగ్దానం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ మాటలు అన్నారు.

ఇంటింటి ప్రచారం చేస్తూ విస్తృతంగా పర్యటించారు. అనంతరం నగరంలో ని 33వ డివిజన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను డివిజన్ ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తానో ముందు గానే ఓ ప్రణాళిక విడుదల చేసారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ప్రజలు కు అందు బాటు లో వుండి.. ప్రజా సమస్యల పై పోరాడుతున్న ప్రజా సేవకుడు  నని అధికారం ఇస్తే అది ప్రజల కే ఉపయో గిస్తానని అన్నారు..

33 వ డివిజన్ కార్పొరేటర్ సీపీఎం పార్టీ అభ్యర్థి రెడ్డి శంకరరావు. ఈ మేరకు  నిర్వహించిన మీడియా మీట్ లో సీపీఎం నేతలు.. పార్టీ అభ్యర్థి శంకరరావు ను గెలిపిస్తే 33 వ డివిజన్ లో సమస్యలపై కార్పొరేషనలో ప్రశ్నిస్తారని అన్నారు.

ప్రజాసమస్యల పై పోరాడే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలు కు మాత్రమే వుంది అని అన్నారు. శంకరరావును గెలిపిస్తే ఆస్తి పన్ను భారాలు రద్దు చేయాలని పోరాడుతారని ఇప్పటికే ఈ సమస్య పై పోరాడుతున్నారన్నారు.

నిరంతరం ప్రజాసమస్యల పై పోరాడుతున్నామని,ఒక్కసారి అవకాశమిస్తే డీవిజన్ ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోరాడుతారని కార్పొరేషన్ లో ప్రజా సమస్యల పై ప్రజావాణిని వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా నేతలు ఆనంద్,మణికంఠ, జగదాంబ, రామకృష్ణా,చిన్నమ్మలు,సురేష్ తదితరులు  పాల్గొన్నారు.

Related posts

చెరువు కట్ట అక్రమాలకు తొలగింపుకు శ్రీకారం

Bhavani

పోలీసు సంక్షేమ పాఠశాలకు కంప్యూటర్లు అందజేసిన మైలాన్

Satyam NEWS

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS

Leave a Comment