22.7 C
Hyderabad
February 14, 2025 01: 33 AM
Slider సంపాదకీయం

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

NRT covid

ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వార్తలు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా తయారయ్యాయి. అసలే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందున్నది. ఈ క్రమంలో ఏ న్యూస్ కరోనా కు సంబంధించినది వచ్చినా ఒక ఫొటోకు ఇంకో ఫొటోకు, ఒక వీడియోకు బదులు మరొకరి వీడియోలు వాడుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో సోమవారం ఇదే ఘటన చోటు చేసుకుంది. ఘనపూర్ మండలం చెల్పూర్ గ్రామ పరిధిలో ఉన్న కేటిపిపి sbi బ్యాంక్ లో కాషియర్ గా పని చేస్తూన్న కృష్ణ గత నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు.

అనంతరం కేటిపిపి హాస్పటల్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్న క్రమంలోనే వైద్యులు ఎంజీఎం కు కరోన పరీక్ష నిమిత్తం తరలించారు. దీంతో కేటిపిపి బ్యాంక్ ఉద్యోగికి కరోన అంటూ, ఒక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

దీంతో అధికారులు సైతం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలీ విషయం పై అరా తీయగా వీడియోలో ఉన్న వ్యక్తి కృష్ణ కాదు నిర్ధారణ అయింది. అయితే ఆ వీడియో లో ఉన్న వ్యక్తి ఎవరు అని అందరు తలలు పట్టుకుంటున్న  క్రమంలో సత్యం న్యూస్ క్లారిటీ ఇచ్చింది.

గుంటూరు జిల్లా పిడుగు రాళ్ల కు చెందిన మల్లికార్జునరెడ్డి అనే యువకుడికి సంబంధించిన వీడియో అది. అతనికి సంబంధించిన అంశాలు ఇస్తూ సత్యం న్యూస్ పోస్టు పెట్టడంతో అప్పటి వరకూ వైరల్ అయిన ఆ వీడియోపై క్లారిటీ వచ్చింది. దీంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ల పట్టివేత

mamatha

పత్రికా విలేకరిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

mamatha

రేపు కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కు అనుమతి

Satyam NEWS

Leave a Comment