37.2 C
Hyderabad
April 26, 2024 21: 42 PM
Slider విజయనగరం

పోలీసు సంక్షేమ పాఠశాలకు కంప్యూటర్లు అందజేసిన మైలాన్

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బ్యారెక్స్ వద్ద నడపబడుతున్న శార్వాణి పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలకు పూసపాటిరేగ
మండలం జి.చోడవరం గ్రామంలోగల మైలాన్ లేబరేటరీస్ యాజమాన్యం కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి.ఎస్.ఆర్)గా అందజేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ ఎం. దీపిక మరియు మైలాన్ సి.ఎస్.ఆర్. హెడ్ ఎం. డొమినిక పోలీసు సంక్షేమ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటరు లేబ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – జిల్లా ఎస్పీగా తాను బాధ్యతలు చేపట్టిన తరువాత పోలీసు సంక్షేమ పాఠశాలను సందర్శించే సమయంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు కంప్యూటరు లేబ్ ఉంటే బాగుంటుందని భావించానన్నారు. ఇందులో భాగంగా మైలాన్ లేబరేటరీ యాజమాన్యంను సంప్రదించగా వారు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 5 లక్షల వ్యయంతో 10 కంప్యూటర్లు, ఒక కలర్ ప్రింటరు, ఇన్వర్టరును అందించారన్నారు.

కంప్యూటరు పరిజ్ఞానంతో విద్యార్థుల చదువుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. పోలీసు పాఠశాలకు వితరణగా కంప్యూటర్లను అందజేసిన మైలాన్ లేబరేటరీ యాజమాన్యంకు జిల్లాఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.మైలాన్ లేబరేటరీస్ హెచ్.ఆర్. విభాగం హెడ్ డా. ఎన్. ఎం. రావు మాట్లాడుతూ – తమ కంపెనీ తరుపున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎల్లప్పుడు ముందుంటామన్నారు. విద్య, ఆరోగ్యం, నీటి సౌకర్యం కల్పించుటకు ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజలకు తమవంతు సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మందులను అందించడం, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ తమవంతు సేవలందిస్తున్నామన్నారు. మారుతున్న
విద్యా వ్యవస్థలో విద్యార్థులకు కంప్యూటరు పరిజ్ఞానం లేకపోవడమే నిరక్షరాస్యతన్నారు.

కావున, తాము అందించిన కంప్యూటర్లును ఇతర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. పోలీసు సంక్షేమ పాఠశాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మైలాన్ లేబరేటరీస్ సి.ఎస్.ఆర్. హెడ్ శ్రీమతి ఎం. డొమినిక మాట్లాడుతూ విద్యార్ధులకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోలీసు పాఠశాలకు కంప్యూటర్లును అందించామని, వీటిని సద్వినియోగం చేసుకొని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మైలాన్ హెచ్.ఆర్. హెడ్ ఎన్.ఎం.రావు, సి.ఎస్.ఆర్. హెడ్ ఎం. డొమినిక, ప్లాంట్ హెడ్ ఎన్.అంజనీ కుమార్, సీనియర్ జి.ఎం. కే.జి.రావు ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి,
వెల్ఫేర్ ఆర్ ఐ పి.నాగేశ్వరరావు, అడ్మిన్ ఆర్ఐ చిరంజీవి, ఎస్టీఎఫ్ ఆర్ఐ మరియన్ రాజు, భోగాపురం సీఐ విజయనాధ్, జి.రాంబాబు,మైలాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, ఎస్ఐ నరేష్, ఆర్ఎస్ఐలు నారాయణరావు, శ్రీనివాసరావు, మరియు ఇతర అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కువైట్ లో తెలుగు వారి కన్నీటి కష్టాలు

Satyam NEWS

అందరివాడు సున్నం రాజయ్య

Bhavani

సంక్రాంతి ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

Satyam NEWS

Leave a Comment