37.2 C
Hyderabad
May 6, 2024 13: 58 PM
Slider మహబూబ్ నగర్

పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి

#cpmkollapur

పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో గల యన్మనబెట్ల గ్రామం లో సిపిఎం  కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జల్లాపురం సురేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారాలు మోపడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చెబుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అనడం సిగ్గుచేటు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ధరలు పెంచి సామాన్య ప్రజలు బ్రతకలేనటువంటి స్థితికి తీసుకరావడం కేంద్ర బిజెపి ప్రభుత్వం ఘనత అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన అనేక భారాలు మోపడం సిగ్గుచేటు అన్నారు.

ఉపాధి హామీ పనులు గ్రామగ్రామాన ప్రారంభించి కూలీలకు పని కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొగిలి కృష్ణ, చటనమోని వెంకటయ్య, ఎల్ల గౌడ్, మరాఠి కుర్మయ్య, పాశం మద్దిలేటి, మొగిలి వెంకటయ్య మరియు రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంతో వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రులు

Satyam NEWS

హోటల్ మా ఆహ్వానం ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

భూమి కేసులో సుప్రీంకోర్టు స్టేటస్ కో

Satyam NEWS

Leave a Comment