40.2 C
Hyderabad
May 5, 2024 18: 55 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో నేరాల తగ్గుముఖం

#wanaparthypolice

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయములోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి పత్రికా సమావేశంలో జిల్లా వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ప్రమాదాలను నివారించే లక్ష్యంగా పనిచేసిన జిల్లా పోలీసు యంత్రాంగం దానిని విజయవంతంగా పూర్తి చేసి గణనీయంగా ప్రమాదాలను తగ్గించగలిగామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో మహిళలపై జరుగు నేరాల సంఖ్య తగ్గుముఖం కావడంలో తోడ్పాటు అందించిన షీటీం బృందాలు చేసిన కృషి ఎంతగానో దోహాదపడిందని తెలిపారు.   జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల నిర్మూలనకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీ చేస్తూ జిల్లాలో ఎటువంటి గంజాయి లాంటి మతపదార్థాలు లభించకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం ఒకరికి సివిల్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించడం, ఒక జూనియర్ అసిస్టెంట్ కు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్, వనపర్తి సీఐ శ్రీ మహేశ్వర్, కొత్తకోట సీఐ రవిపాల్, ఆత్మకూరు సిఐ రత్నం,  డిసిఆర్బి ఎస్. ఐ.లు జిల్లా ఎస్ఐలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

తొలి మహిళా పార్క్ ప్రారంభించే మహిళా మంత్రి

Satyam NEWS

మల్లాపూర్ ఎన్ఎఫ్సీ ఎక్స్ రోడ్ వద్ద అదనపు రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని వినతి

Satyam NEWS

కోల్‌కతా దీదీదే.. తృణమూల్‌ ‘హ్యాట్రిక్‌’

Sub Editor

Leave a Comment