26.7 C
Hyderabad
May 3, 2024 10: 06 AM
Slider ప్రత్యేకం

రెచ్చిపోయిన కామాంధులు: మైనర్లపైనే తీర్చుకున్న కామవాంఛలు

#focso

పోక్సో చట్టంతో మైనర్లకు ఎస్పీ అండ: “సత్యం న్యూస్. నెట్” ఇయర్ రౌండప్

గడచిన మూడేళ్లుగా విజయనగరం జిల్లాలో రెచ్చిపోతున్న కామాంధులపై పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. 2021 నుంచి ఈ ఏడాది వరకు నమోదైన పోక్సో కేసులు, అందులో అభాగ్యులకు న్యాయం చేసిన వైనాన్ని..”సత్యం న్యూస్. నెట్” …పోలీసు శాఖ ప్రోత్సాహం తో వెలుగులో కి తీసుకొచ్చింది. ఒక్క సారి సింహా లోకం చేద్దామంటోంది… “సత్యం న్యూస్. నెట్”. పోక్సో కేసుల్లో నిందితులకు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం వరుసగా శిక్షలు ఖరారు చేయడంతో కోర్టు విచారణకు హాజరవుతున్న నిందితుల వెన్నులో వణుకు మొదలయ్యింది.

2023 ఇప్పటి వరకు 8 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలను పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విధించడం వెనుక కేసుల్లో పోలీసు అధికారుల దర్యాప్తు, సాక్ష్యాలు సేకరణ, సాంకేతిక నైపుణ్యం, ప్రాసిక్యూషను విచారణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం, కేసులను నిరంతర పర్యవేక్షించి, సమీక్షించడం, బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పం వంటి అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తు న్నాయని జిల్లా ఎస్పీ ఎం.దీపిక  అన్నారు.

గతంలో పోక్సో కేసులు నమోదైనప్పటికీ న్యాయస్థానాల్లో విచారణలో జాప్యం తలెత్తేది. నేడు పోక్సో కేసులను ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక న్యాయ స్థానాలు ఏర్పాటు, పోలీసు వాదనలను వినిపించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు జరగడంతో సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఇటీవల పోక్సో కేసుల్లో నేరాల నిరూపణలో సంబంధిత పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం, ఉన్నతాధికారులు పలుమార్లు దర్యాప్తును ప్రాధమిక స్థాయిలోనే పరిశీలించి, లోపాలను గుర్తించి, దర్యాప్తు అధికారులకు సూచనలు చేయడంతో నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు.

అంతేకాకుండా, న్యాయస్థానంలో సాక్యులు సకాలంలో హాజరుపర్చడం, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సాక్ష్యం చెప్పే విధంగా శ్రద్ధ చూపడం, రాష్ట్ర డిజిపి జే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో కొన్ని తీవ్ర నేరాలను ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చి ప్రాసిక్యూషను ప్రగతిని ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షించడం, దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను సేకరించి, నేరంలో నిందితుడి పాత్రను న్యాయస్థానంలో శాస్త్రీయంగా నిరూపించగలగం శిక్షల ఖరారుకు తోడ్పడుతున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు.

ఈ  ఏడాది 8 పోక్సో కేసుల్లో నిందితులు శిక్షింపబడగా, వాటిలో 5 కేసుల్లో నిందితులు 20సం.లకు పైబడి జైలు జీవితం అనుభవించే పరిస్థితులు ఏర్పడ్డాయని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. జిల్లాలో ఇటీవల నిందితులకు శిక్షలు పడిన పోక్సో కేసుల వివరాలు.. జిల్లా దిశ మహిళా పోలీసు స్టేషనులో  2021 సెప్టెంబర్ 9 దిన నమోదైన పోక్సో కేసులో నిందితుడైన గంట్యాడ మండలం కొర్లాం గ్రామం కారు చిన్నారావు (33 సం.లు)కు 20సం.లు జైలు, 16 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ ఏప్రిల్ 21న తీర్పు వెల్లడించింది. ఈ కేసును అప్పటి దిశ డిఎస్పీ టి. త్రినాధ్ దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు.

విజయనగరం జిల్లా గంట్యాడ పోలీసు స్టేషనులో తే, నవంబర్ పది.. 2019 నమోదైన పోక్సో మరియు అట్రాసిటి కేసులో నిందితుడైన గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామం సారిపల్లి చిన్నారావు (65సం.లు)కు 20సం.లు జైలు,  2వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ మే 22న తీర్పు వెల్లడించింది. ఈ కేసును అప్పటి ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్సీ బి.మోహనరావు దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో తే. 24-06-2022 దిన నమోదైన పోక్సో కేసులో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం పెద్దనీది గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాద్ అలియాస్ రుషికుమార్

(వయస్సు 20సం.లు)కు 20సం.లు జైలు,  20 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం. శిక్ష విధిస్తూ అక్టోబరు 9న తీర్పు వెల్లడించింది. ఈ కేసును అప్పటి దిశ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు.  విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2018 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన విజయనగరం పట్టణం లంకాపట్నంకు చెందిన పొడుగు అరవింద్ అలియాస్ హరి (వయస్సు 22సం.లు) కు 3 సం.లుజైలు, .1500/-లు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ నవంబరు 2న తీర్పు వెల్లడించింది.

ఈ కేసును అప్పటి 2వ పట్టణ ఎసస్ఐ వి. అశోక్ కుమార్ నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చే సి, నిందితుడిపై అభియోగ పత్రం దాఖలు చేసారు. అలాగే జిల్లా బొబ్బిలి పట్టణ పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన బొబ్బిలి పట్టణం కంచరవీధికి చెందిన విక్రమ్ యేసు (వయస్సు 34సం. లు)కు 4 సం.లు జైలు, 1000/-లు జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ నవంబరు 9న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దర్యాప్తును అప్పటి బొబ్బిలి ఎస్ఐ కే.టి.ఆర్. లక్ష్మి నిర్వహించి చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు.

అలాగే జిల్లాలోని బొబ్బిలి పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన 10న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అప్పటి బొబ్బిలి ఎస్ఐ వెలమల ప్రసాదరావు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన బొబ్బిలి మండలం పాతపెంటకు చెందిన గిరడ లక్ష్మణ అలియాస్ చిన్న కు 23 సం.ల ఆరు మాసాలు కఠిన కారాగార శిక్ష మరియు 11,500/- లు జరిమానా విధిస్తూ అక్టోబరు 17న పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో అప్పటి బొబ్బిలి ఎఎస్సీ గౌతమీ శాలీ దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. ఇక జిల్లాలోని చీపురుపల్లి పోలీసు స్టేషనులో 2018 సం. లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన గరివిడికి చెందిన కాకర్లపూడి రాంకుమార్ వర్మ (24 సం. లు)కు 20సం. లు కఠిన కారాగారం, రూ.5వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 16న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అప్పటి బొబ్బిలి డిఎస్పీ పి. సౌమ్యలత, బొబ్బిలి ఎఎస్పీ గౌతమీ శాలీ దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

కరప్షన్: కలెక్టరేట్ లో అవినీతి తిమింగలం

Satyam NEWS

34 మంది విద్యార్ధుల సస్పెండ్

Murali Krishna

వృద్ధ మహిళను హత్య చేసిన వాలంటీర్

Bhavani

Leave a Comment