29.7 C
Hyderabad
May 3, 2024 03: 16 AM
Slider విజయనగరం

విజయనగరం ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం…!

#deepikapatil

విజయనగరం జిల్లా పోలీస్ బాస్ గా బాధ్యతలు తీసుకున్న దీపికా ఎం పాటిల్.. డీపీఓలో తొలి సారిగా నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ని దండుమారమ్మ టెంపుల్ లో జరిగిన జిల్లా నేర సమీక్ష సమావేశానికి మూడు డివిజన్ డీఎస్పీ లు నాలుగు సర్కిళ్ల ఇన్ స్పెక్టర్లు హాజరయ్యారు. గత నెలలో అన్ని పోలీసు స్టేషనలలో నమోదైన భారీ నేరాలు వాటి దర్యాప్తు.. ఎంతవరకు వచ్చింది.. వాటి పురోగతి పై ఎస్పీ నిశితంగా అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే దిశ ద్వారా నమోదవుతున్న కేసులు.. తద్వారా బాధ్యత మహిళల జరుగుతున్న న్యాయం పైన కూడా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. జిల్లా నేర సమీక్షా సమావేశం ఎస్పీ తీసుకున్న ఎస్పీ…దాదాపు మూడుగంటల పాటు సమీక్షించారు. విజయనగరం, బొబ్బిలి స్టేషన్ లలో కేసులను ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ గత నెలలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను, అదృశ్యం కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్లాక్ స్పాట్ లను గుర్తించి, ప్రమాదాల జరగకుండా ఉండేందుకు, వాహనదారులు జాగ్రత్తలు పాటించే విధంగా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఐటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని,  5వేలుకు వరకు నగదు పోయిన ఫిర్యాదుల వివరాలను సీఐడీ విభాగంలోని సైబరు క్రైం పోర్టల్ లో నమోదు చేయాలని, అంతకంటే పైబడి నగదు పోయిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఎటిఎం కేంద్రాల్లో మోసాలకు పాల్పడిన కేసుల్లో వెంటనే సీసీ ఫుటేజును పొంది, దర్యాప్తును త్వరితగతిన చేపట్టాలన్నారు. పోలీసు స్టేషనులను ఆశ్రయించే మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారు చెప్పిన వివరాలను శ్రద్ధగా విని, తగిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలకు సంబంధించిన నేరాల్లో వారి స్టేటుమెంట్లు రికార్డు చేసే సమయంలోను, వారితో మాట్లాడే సమయంలో తప్పనిసరిగా మహిళా సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం లభించే కేసుల్లో వివరాలను సకాలంలో ఉన్నతాధికారులకు అందించి, బాధితులకు నష్ట పరిహారం సకాలంలో అందే విధంగా చూడాలన్నారు.

నాన్ బెయిలబుల్ వారంటును పెండింగు కేసుల్లో ష్యూరిటీలను కోర్టులో హాజరుపర్చి, వారంట్లు అమలయ్యే విధంగా వారిపై ఒత్తిడి తేవాలన్నారు. ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల యజమానుల వివరాలను తప్పనిసరిగా రికార్డ్సులో పొందిపర్చి, వివరాలను న్యాయస్థానాలకు అందించాలన్నారు. తీవ్రమైన నేరాలుగా నమోదైన కేసుల్లో జీసీఆర్ లను 10 దినాల్లోగా డీసీఆర్ బికి పంపాలన్నారు.

వ్యక్తులు అదృశ్యమైన కేసుల్లో వివరాలను, కేసుల దర్యాప్తు వివరాలను సీసీటీఎన్ఎస్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఎక్సైజ్, రోడ్డు ప్రమాద కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఫోరెన్సిక్ పరీక్షలు అవసరమైన కేసుల్లో మెటీరియల్స్ ను ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పరీక్షలకు పంపాలన్నారు. అనంతరం, సిఐలు, డీఎస్పీలు దర్యాప్తు చేస్తున్న తీవ్రమైన నేరాలను జిల్లా ఎస్పీ సమీక్షించి, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు దిశా నిర్దేశం చేసారు. రోడ్డు ప్రమాదాల నియంత్రించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలన్నారు.

పార్వతీ పురం డీఎస్పీ ఎ.సుభాష్ ప్రత్యేకంగా రూపొందించిన “మై పీఎస్” మొబైల్ యాప్ ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆవిష్కరించారు. ఈ యాప్ ను వినియోగించడం వలన సబ్ డివిజనులోని ప్రతీ పోలీసు ఉద్యోగి సబ్ డివిజనులో నమోదైన, దర్యాప్తులో ఉన్న కేసులు, మిస్సింగు వ్యక్తులు, బీట్లు, హిస్టరీ షీటు వ్యక్తుల వివరాలను సులువుగా తెలుసుకో వచ్చునన్నారు.

ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక నగదు బహుమతులు గత నెలలో ఉత్తమ పని తీరును కనబర్చిన డెంకాడ ఎస్ఐ ఎన్. పద్మావతి, డీసీఆర్ బి కానిస్టేబులు పి.శివ కుమార్ రాజులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను బహూకరించారు.

గత మాసంలో కేసుల ఛేదనలో విశేష ప్రతిభ కనబర్చిన పార్వతీపురం సీఐ వి. హెచ్. విజయానంద్, పార్వతీపురం రూరల్ ఎస్ఐ జి. వీరబాబు, ఎఎస్ఏలు వి.రవికుమార్, జి. శ్యామసుందరరావు, హెచ్ సి కే.రాజేశ్వరరావు, కానిస్టేబులు కే.శంకర రావులను, చీపురుపల్లి ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు, లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేసినందుకుగాను వన్ టౌన్ సీఐ జె.మురళి, బొబ్బిలి ఎ` సిహెచ్.సత్యన్నారాయణ, సాలూరు పట్టణ ఎస్ఐ షేక్ ఫకృద్దీన్, పాచిపెంట ఎస్ఐ ఎం.వెంకట రమణలను, లోక్ అదాలత్ కేసులను పరిష్కారంలోను, ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చుటలో ప్రతిభ కనబర్చిన డెంకాడ హెచ్ సి ఎల్.వి.ఎస్.సురేష్, విజయనగరం వన్ టౌన్ హెచ్ సి ఎ.రమణారావు, రికార్డ్సు మరియు కంప్యూటరు పరిజ్ఞానం కలిగి ఉన్నందుకు బొబ్బిలి పట్టణ మహిళా పీసీ ఎం. ధనలక్ష్మిలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

Related posts

సిఎం పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాశారు

Satyam NEWS

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Satyam NEWS

Leave a Comment