37.2 C
Hyderabad
May 2, 2024 12: 24 PM
Slider విజయనగరం

13న ఎంఎల్సీ ఎన్నిక పోలింగ్… జాగ్రత్తగా విధులు నిర్వర్తించండి…!

#reviewmeeting

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పెండింగులో ఉన్న పోక్సో మరియు గ్రేవ్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పోక్సో మరియు గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు పూర్తి అవ్వకపోవడానికి గల కారణాలను దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకొని, ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయడానికి అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేసారు. నిందితులకు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చే సమయంలో సుప్రీం కోర్టు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడే విధంగా సంబంధిత సిఐలు, ఎస్ఐలు కొన్నింటిని ప్రాధాన్యత కేసులుగా గుర్తించి, ఆయా కేసుల్లో ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తి చేసి, నిందితులు తప్పనిసరిగా, త్వరితంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని, అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారి పనితీరును పర్యవేక్షించాలన్నారు. అలాగే ఈ నెల 13న జరగబోవు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికను సజావుగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

పోలింగు కేంద్రాల వద్ద బ్యారికేడ్స్, సైనేజ్ లు ఏర్పాటు అయ్యే విధంగా రెవెన్యూ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే సంబంధిత జోనల్ అధికారుల సహాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగు రోజున పోలింగ కేంద్రాల వద్ద 144 సిఆర్పిసి అమలు చేసేందుకు సంబంధిత రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు పొందాలని, 200మీటర్లు దూరం వరకు ఎటువంటి షామియానాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గత మాసం లో నమోదై, దర్యాప్తు పెండింగులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నిర్దిష్ట రోజుల్లోగా సంబంధిత న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.

ఈ సమీక్షా సమావేశంలో సెబ్ అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాస రావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు వై. పరశురాం, పబ్లిక్ ప్రాసిక్యూటరు కేశవరావు, సిఐలు జె. మురళి, జి. రాంబాబు, రుద్రశేఖర్, బి.వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, టి.వి. తిరుపతిరావు, ఎస్.బాల సూర్యారావు, విజయనాధ్, దిశ సిఐ ఎం. శేషు, ఎల్. అప్పలనాయుడు, ఎం. నాగేశ్వరరావు, ఎస్. తిరుమలరావు, ఎస్. కాంతారావు, జి.సంజీవరావు, హెచ్.ఉపేంద్ర, వివిధ పోలీసు స్టేషనుల్లో పనిచేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

జూన్ 2 వరకు క్రమబద్దీకరణ

Murali Krishna

అరబ్ ఎమిరేట్స్ కు అమెరికా యుద్ధ విమానాలు

Satyam NEWS

ప్రజల కోసం పని చేయండి… ప్రజా అవసరాలను తీర్చండి…!

Bhavani

Leave a Comment