40.2 C
Hyderabad
April 28, 2024 18: 37 PM
Slider విజయనగరం

ప్రజల కోసం పని చేయండి… ప్రజా అవసరాలను తీర్చండి…!

ప్రజలలోకి వెళ్ళండి, ప్రజా అవసరాలు తీర్చండి, పార్టీ కోసం సమయాన్ని కేటాయించండని విజయనగరం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు విజయ నగరంలోని కొత్తపేట యాదవ కళ్యాణ మండపంలో జరిగిన 1,2,3,4,12,13, 14 డివిజన్లకు సంబంధించి జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పట్టిష్ఠానికి కార్యకర్తలే వెన్నెముకని అన్నారు. కార్యకర్తలు పని విధానం వల్లే మనం అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. కార్యకర్త నుంచి జెండా పట్టుకున్న నాడే పార్టీకి మనుగడ ఉంటుందని, పటిష్టంగా ఉంటుందని, తగిన గుర్తింపు కూడా ఉంటుందని అన్నారు. అందరి కష్టంతో తాను ఈ స్థాయిలో పదవిలో ఉన్నానని అన్నారు. కార్యకర్త లకు అండగా ఉంటూ, నిరాశ పడే పనులు చేయకూడదని, కార్యకర్త బాధను తీర్చవలసిన బాధ్యత నాయకులు పై ఉందని అన్నారు. తనకు వచ్చిన పదవి విజయనగరం ప్రజలు ఇచ్చిన గౌరవంతో పాటు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇచ్చిన గౌరవంగా తాను ఆనాడే సభలో ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. ఒక క్యాలెండర్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. గడపగడపకు కార్యక్రమానికి ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాయమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం పరిపాట అయిపోయింది అన్నారు. కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ బంగ్లాకు తాళాలు వేసుకుంటే, ప్రజల మధ్య ఉంటూ , ప్రజలకు భరోసా ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దానికి నిదర్శనం నగరపాలక ఎన్నికల్లో 50 స్థానాలకు గాను 48 స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. ఫ్లోర్ లీడర్, జోనల్ ఇన్చార్జ్ ఎస్ వి వి రాజేష్ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషి ఫలితంగానే పార్టీ పటిష్టమవుతుందని అన్నారు. ఆ దిశగా డివిజన్ వారీగా, జోనల్ వారీగా ఐక్యమత్యంగా కృషి చేద్దామని అన్నారు. వైసిపి విజయనగరం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ పాలన రానున్న ఎన్నికలలో శ్రీరామరక్షగా పార్టీ విజయం సాధించగలరని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన బొంగ భానుమూర్తిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అభినందించారు. పార్టీ నాయకులు ఆయనను సత్కరించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి ఇస్సరపు రేవతి దేవి, జోనల్ నాయకులు ముచ్చు శ్రీనివాసరావు, ఇ సరపు రామకృష్ణ, కార్పొరేటర్లు బండారు ఆనంద్, వజ్రపు సత్య గౌరీ, మారోజు శ్రీనివాసరావు, బుంగ రూప దేవి, కో ఆప్షన్ సభ్యులు. శ్రీమతి ముద్దాడ రమణి, పైడితల్లి అమ్మవారి పాలకమండలి సభ్యులు వెచ్చ శ్రీనివాసరావు,పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రేపు కరీంనగర్ లో దసరా సినిమా విజయోత్సవ సభ

Bhavani

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ను బిసిలకు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment