30.3 C
Hyderabad
March 15, 2025 10: 50 AM
Slider జాతీయం

గ్రేట్ సర్వీస్:గర్భిణీ స్త్రీనిఆసుపత్రిలో చేర్పించిన సీఆర్ఫీఎఫ్

crpf pregnate lady 6 km

ప్రసవ వేదన పడుతున్నగర్భిణీ స్త్రీని 6 కిలోమీటర్ల మేర అభయారణ్యం గుండా తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది.ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని పాడేడా గ్రామంలోని ఈ సంగటన జరిగింది.సిఆర్పిఎఫ్ పాడెడా గ్రామంలోని లోతైన అరణ్యాలలో పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్ఫీఎఫ్ సిబ్బంది గర్భిణీ స్త్రీ పరిస్థితి బాగాలేదని చెప్పడం తో కమాండర్ అవినాష్ రాయ్ సమయం వృథా చేయకుండా, కంపెనీ కమాండర్ తన బృందంతో ప్రథమ చికిత్స నిపుణులతో బూడి అనే మహిళ ఇంటికి చేరుకున్నారు.

అక్కడికి చేరుకున్న తరువాత, ఆ మహిళ ఒక బిడ్డను ప్రసవించబోతోందని మరియు వెంటనే వైద్య సహాయం అవసరమని బృందం తెలుసుకుంది.గ్రామం మారుమూల ప్రాంతంలో ఉన్నందున సమీపంలో వైద్య ఆరోగ్య కేంద్రం లేదు. రోడ్లు లేకపోవడంతో ఏ వాహనమూ ఈ ప్రాంతానికి చేరుకోలేదు.వెంటనే సిఆర్పిఎఫ్ బృందం ఒక మంచం ను పల్లకీ లా తయారు చేసి ఆ మహిళను అందులో పడుకో బెట్టి 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం భుజంపైమోసుకుంటూ బీజాపూర్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.ఈ సంఘటన తో సీఆర్ఫీఎఫ్ సిబ్బంది సేవలను పలువురు ప్రశంసించారు.

Related posts

అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ గా వుండాలి

Murali Krishna

వరద ఉధృతి ఎక్కువగా ఉంది… గోదావరి లోకి వెళ్లద్దు

Satyam NEWS

నదీ జలాలపై శాస్త్రీయ పరిష్కారం అవసరం

Satyam NEWS

Leave a Comment