37.7 C
Hyderabad
May 4, 2024 13: 23 PM
Slider ప్రత్యేకం

సకాలంలో ఫిర్యాదు చేస్తే సైబరు నేరాలను ఛేదించవచ్చు

#deepikaips

సైబర్ నేరాల పై సకాలంలో ఫిర్యాదు చేస్తే నేరాల మిస్టరీని చేధించవచ్చునని  విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. సైబరు నేరాలను నియంత్రించుట, దర్యాప్తును వేగవంతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పోలీసు అధికారులు, సిబ్బందితో విజయనగరం సబ్ డివిజన్ కార్యాలయంకు సమీపంలో ప్రత్యేకంగా సైబర్ క్రైం సెల్ ను ఇటీవల కాలంలో ఏర్పాటు చేసామన్నారు.

ఈ సెల్ లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ఒకవైపు ప్రజలకు సైబరు నేరాలకు గురికాకుండా ఉండేందుకు అపార్టుమెంట్లు, గ్రూపు హౌస్లు, గ్రామాలను సందర్శిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలను చేపడుతూ, మరోవైపు సైబరు నేరాలపై నమోదైన కేసుల దర్యాప్తును చేస్తు, మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో నమోదైన సైబరు కేసుల్లో బాధితులు సకాలంలో ఫిర్యాదు చేయడం వలన వారు పోగొట్టుకున్న నగదును తిరిగి వారి అకౌంట్లులో జమయ్యే విధంగాను, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

కేసుల మిస్టరీని చేధించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సైబరు నేరగాళ్ళను కూడా పట్టుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా సైబరు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు పంపే ఈ-మెయిల్స్, మెసేజ్ లు, లింకులపై క్లిక్ చేయవద్దన్నారు. మీ మొబైల్స్ కు వచ్చే ఒ.టి.పి.లను ఇతరులకు షేర్ చేస్తే, మీ డబ్బులను పోగొట్టుకున్నట్లేనన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పుడు మన ఒ.టి.వి.లను అడగదన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

అదే విధంగా ఉద్యోగాలు పేరుతో పంపే లింకులు, ఫేక్ కాల్స్ ను నమ్మవద్దని, మన విద్యార్హతలు పరిశీలించకుండా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదన్న వాస్తవాలను యువత గుర్తించాలన్నారు. అపరిచిత వ్యక్తులకు రిమోట్ డెస్క్ టాప్ గా వినియోగించే అవకాశంను కల్పించవద్దన్నారు. ఇటీవల కాలంలో సైబరు నేరాల పట్ల పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరించడం వలన 7,లక్షల 55 వేల 565 లను నష్టపోకుండా చేయగలిగామన్నారు.

జాబ్ ఆఫర్స్ పేరుతో ఎవ్వరికీ నగదు బదిలీ చేయవద్దని ప్రజలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక కోరారు. ఇటీవల కాలంలో ఈ ప్రత్యేక సైబరు బృందం కేసుల మిస్టరీని ఛేదించి, బాధితులకు సాంత్వన చేకూర్చిన కేసుల్లో కొన్ని ముఖ్యమైనవి.

ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ ద్వారా ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపుతూ ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు సైబరు బృందం, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి నిందితుడు ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ బృందం నిందితుడిని అరెస్టు చేసి, వేధింపులకు చెక్ పెట్టారు.

బొబ్బిలికి చెందిన ఒక మహిళకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్నట్లుగా నమోదైన కేసులో, నిందితుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, అతడిపై చర్యలు చేపట్టడంతో వేధింపులకు ముగింపు పలికారు.

భోగాపురం పి.ఎస్ పరిధిలో ఒక వ్యక్తికి మోసపూరిత లింకను పంపి, అతని బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని నమ్మించి, ఒ.టి.పి. వంపమని చెప్పి, అతని బ్యాంకు ఖాతా నుండి నిందితుడు 2,లక్షల 24,వేల 998లు చోరీకి పాల్పడగా, బాధితుడు సైబరు క్రైం పోలీసులను ఆశ్రయించగా, బృందం సభ్యులు బ్యాంకు అధికారులు, గేట్ వే అధికారులతో సంప్రదింపులు జరిపి బాధితుని బ్యాంకు ఖాతాకు తిరిగి రూ. 2,00,000 వెనుకకు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు.

ఎస్.కోట పి.ఎస్ పరిధిలో ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ అక్కౌంట్ నుండి ఎఅపిఎస్ సిస్టం ద్వారా ఖాతాదారుని అనుమతి లేకుండా 10వేలు చొప్పున 2 సార్లు మరియు ఇతర గేట్ వే ద్వారా రూ. 2వేలను మూడు సార్లు డెబిట్ అయినట్లుగా గుర్తించి, ఫిర్యాదు చేయగా, సైబర్ సెల్ ఎస్ఐ మరియు సిబ్బంది సాంకేతిక ఆధారాల సహాయంతో రూ. 20వేలు తిరిగి తెప్పించి, బాధితుడికి ఉపశమనం కల్పించారు.

పూసపాటిరేగకు చెందిన ఒక వ్యక్తికి సైబరు మోసగాడు ఫేక్ కాల్ చేసి, ఒ.టి.పి. చెప్పమని కోరి, అతని ఖాతా నుండి 5,704 చోరీ చేయగా, బాధితుడు ఈ విషయాన్ని గుర్తించి, ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైం సెల్ టీం తక్షణమే స్పందించి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితున్ని గుర్తించి, మొత్తం నగదును తిరిగి బాధితుని బ్యాంకు ఖాతాకు చేరే విధంగా చర్యలు చేపట్టారు.

చీపురుపల్లికి చెందిన ఒకామె తన ఫ్లైట్ టికెట్లు కేన్సిల్ చేసే నిమిత్తం ఒక అపరిచిత వ్యక్తికి ఒ.టి.పి. చెప్పడంతో, ఆమె బ్యాంకు ఖాతా రూ. 80వేలు నగదును పోగొట్టుకోగా, సైబర్ క్రైం సెల్ ఎస్ఐ మరియు సిబ్బంది దర్యాప్తు జరిపి వెంటనే ఆమె బ్యాంకు ఖాతాకు కొంత నగుదును తిరిగి తెప్పించుటలో సఫలీకృతం అయ్యారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

తెలంగాణ లో బీజేపీ గ్రాఫ్ డౌన్….?

Bhavani

ప్రభల నిర్మాణానికి డా౹౹చదలవాడ ఆర్ధిక సహాయం

Satyam NEWS

వడదెబ్బకు గురై వ్యక్తి మృతి

Bhavani

Leave a Comment