29.7 C
Hyderabad
May 2, 2024 04: 45 AM
Slider ముఖ్యంశాలు

మాల నాగరాజు హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

#malamahanadu

ప్రేమ వివాహం చేసుకున్న మాల నాగరాజు తన భార్యతో కలిసి బైక్ వస్తుండగా హైదరాబాదులోని సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర్లో బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అతి కిరాతకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా గడ్డపారతో పొడిచి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య డిమాండ్ చేశారు.

తెలంగాణ మాలమహానాడు మహబూబ్నగర్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య  మాట్లాడారు.  గత మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశ్రీన్  సుల్తానాను ప్రేమ వివాహం చేసుకున్నందుకు జీర్ణించుకోలేని అమ్మాయి అన్న ముబీన్ తన అనుచరులతో కలిసి మాల బిల్లాపురం నాగరాజు ను అతి కిరాతకంగా గడ్డపారతో పొడిచి చంపడాన్ని తెలంగాణ మాల మహానాడు గా మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాలలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వాళ్లనే టార్గెట్ చేస్తూ తెలుగు చేస్తున్నారని మండిపడ్డారు.  రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజ మెత్తారు.

మాల నాగరాజు దంపతులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. మాల నాగరాజు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రెండు పలకల ఇల్లు,  50 లక్షల ఎక్స్గ్రేషియాఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు,  జిల్లా ప్రధాన కార్యదర్శిమల్లు మనోజ్ కుమార్,  జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ మరియు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూ మాఫియా కోసమే ధరణి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

Satyam NEWS

తెలంగాణలో పోటీ నుంచి వైదొలగిన వైఎస్ షర్మిలారెడ్డి

Satyam NEWS

రైతు రుణాలు సకాలంలో చెల్లిస్తే రాయితీలు

Satyam NEWS

Leave a Comment