26.7 C
Hyderabad
May 3, 2024 07: 20 AM
Slider గుంటూరు

ప్రభల నిర్మాణానికి డా౹౹చదలవాడ ఆర్ధిక సహాయం

#chadalawada

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్ళకు సంబంధించి నిర్మించే చింతలపాలెం గ్రామ ప్రభకు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆర్ధిక సహాయం అందచేశారు. పార్టీ కార్యాలయంలో చింతలపాలెం గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్మించే ప్రభకు రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు.

గ్రామ పెద్దలు నాగేశ్వరరావు,కోటేశ్వరరావు,వినాయకరావు తదితరులు డా౹౹చదలవాడను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం ఎంతో పవిత్రమైందని తెలిపారు. త్రికోటేశ్వరస్వామి దయతో నరసరావుపేట ప్రాంతం ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,కడియం కోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెంచిన అదనపు కరెంటు బిల్లులను రద్దు చేయాలి

Satyam NEWS

అక్టోబర్ లోగా మన ఊరు -మన బడి పనులు

Bhavani

తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment