తప్పుడు ధృవ పత్రాలతో మహిళలను గల్ఫ్ దేశాలకు తలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నేడు ఈ సంఘటన జరిగింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు ఖతార్ విమానంలో ఎక్కుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరిపారు. దాంతో వారి వద్ద ఉన్నవి తప్పుడు ధృవపత్రాలుగా తేలాయి. దాంతో ముగ్గరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిని పంపిన ఏజెంట్ల కోసం వెతకడంతో వారు కూడా దొరికారు. ఖాజా, జబ్బార్ అనే ఈ ఇద్దరూ తప్పుడు పత్రాలతో మహిళలను గల్ఫ్ దేశాలకు పంపుతుంటారని తేలింది. దాంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఖతార్, బెహరెన్, కువైట్ ప్రాంతాలకు మనుషులను పంపుతుంటారని పోలీసులు తెలిపారు. ఏయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.