38.2 C
Hyderabad
April 29, 2024 15: 01 PM
Slider విజయనగరం

రికార్డ్ … పోలీసు స్పందనకు హెచ్చు సంఖ్యలో ఫిర్యాదులు…!

Vizianagaram

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాలతో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి డిఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ 40 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.


బొండపల్లి మండలం మిద్దూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన కుమారుడు తన బాగోగులు సక్రమంగా చూడడం లేదని, తన పేరున ఉన్న భూములను రిజిస్ట్రేషను చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.


విజయనగరం చెందిన ఒక వ్యక్తి డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికే చెందిన ఒక వ్యక్తి హెూంలోను ఇచ్చే ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజరుగా పని చేస్తూ, తమ వద్ద నుండి ఇంటి లోను మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకొని, మోసగించారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 1వ పట్టణ సిఐను ఆదేశించారు.
కొత్తవలస మండలం రామలింగపురంకు చెందిన ఒకామె డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన పెద్ద కుమారుడు కొన్ని ఖాళీ పేపర్లుపై తన సంతకాలు తీసుకొని ఇల్లు, ఆస్తిని కాజేసాడని, ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సిఐను ఆదేశించారు విజయనగరం చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన వద్ద నుండి స్వంత అవసరాల నిమిత్తం . 3 లక్షలు అప్పుగా తీసుకొని, తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 2వ పట్టణ సిఐను ఆదేశించారు.


విజయనగరం శాంతినగర్ కు చెందిన ఒకామె డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకుగాను తన వద్ద నుండి 4 లక్షలు అప్పుగా తీసుకొని, తిరిగి చెల్లించడం లేదని, ఇంకనూ . 3.25 లక్షలు బకాయి ఉన్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 2వ పట్టణ సిఐను ఆదేశించారు.విజయనగరం జొన్నగుడికి చెందిన ఒకామె డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులు తనపై నిష్కారణంగా దాడి చేసి, తన బట్టలను చింపేసారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని 2వ పట్టణ సిఐను ఆదేశించారు.ఈ “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదించాలని అధికారులను డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిఐ జె.మురళి, ఎన్బీ సిఐ సిహెచ్. రుద్రశేఖర్, డిసిఆర్బి ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

వి ఎస్ యూ లో వైయస్ రాజశేఖరరెడ్డి 74 వ జయంతి

Bhavani

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ అరెస్ట్…!

Satyam NEWS

ఏలూరు జిల్లాలో దిశ యాప్ పై అవగాహన

Satyam NEWS

Leave a Comment