31.7 C
Hyderabad
May 7, 2024 00: 01 AM
Slider రంగారెడ్డి

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ భావితరాలకు బంగారు బాట

#dalitbandhu

తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాల్లో ఒకటైన ద‌ళిత బంధు పథకంలో భాగంగా సోమవారం కీసర మండల పరిధి చీర్యాల గ్రామంలో అర్హులైన దళితులకు 95 వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని దళితులకు వాహనాలను పంపిణీ చేశారు.

మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన 95 మంది లబ్ధిదారులకు 95 ఆటోమొబైల్స్ ఈ పథకం కింద వాహనాలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి,కేపి వివేకానంద్ మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా కోట్ల రూపాయల విలువైన వాహనాలను దళిత బంధు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాం అని అన్నారు.

భార‌త రాజ్యాంగ నిర్మ‌త‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్‌రామ్‌ల ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌ని గుర్తు చేశారు. దేశంలోని అత్యంత దుర్భరమైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న అనేక సామాజిక వ‌ర్గాల పౌరులను ఉద్ధరించే లక్ష్యంతో అనేక సామాజిక కార్యక్రమాలను అవలంబించడం ద్వారా తెలంగాణ పరిపాలన దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

కేవలం డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్న దళితులు ఇప్పుడు రవాణా వాహనాలను కొనుగోలు చేస్తున్నారని, తద్వారా దళితుల ఆర్థిక స్థితిగతులు మ‌రింత మెరుగుప‌రిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ద్వారా కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నర్సింహా రెడ్డి,ఆర్డీవో రవి కుమార్,నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి,బొడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి,ఫీర్జాది గూడ మేయర్ వెంకట్ రెడ్డి,జడ్పీవైస్ చైర్మన్ వెంకటేష్,ఎంపిపిలు, జడ్పీటీసీలు,సర్పంచ్ లు, తెరాస నాయకులు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మైపాల్ రెడ్డి ,బేతాళ బాల రాజ్,సుడుగు మహేందర్ రెడ్డి,మురళి పంతులు,రేపాక కుమారస్వామి, శ్రీరామ్ సత్యనారాయణ,రాజు, వేముల పరమేష్,నాయకులు,కార్యకర్తలు, దళిత బందు లబ్దిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తప్పు చేయను

Satyam NEWS

అక్రమ రేషన్ బియ్యం పట్టిచ్చినా పట్టించుకోని అధికారులు

Satyam NEWS

ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిణి విజయారెడ్డి

Satyam NEWS

Leave a Comment