24.2 C
Hyderabad
July 20, 2024 18: 02 PM
Slider మహబూబ్ నగర్

కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తప్పు చేయను

కొల్లాపూర్ ప్రాంతానికి గుండెకాయలాంటి రాజా కోట ప్రహరీ స్థలంలో నిర్మాణపు పనులను ఆపాలని ఆ స్థలం ప్రజల కోసం ఉపయోగించాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన సంకల్పానికి నేడు తెర పడనుందా? అంటే అవుననే అనిపిస్తుంది. రాజా బంగ్లా ప్రహరీ వెనుక స్థలంలో నిర్మాణం జరిగే కాంప్లెక్స్ పనులు ఆపేయాలని అనుమతులను వెనక్కి తీసుకోవాలని హై కోర్టు నుండి ఆదేశాలు వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. జూపల్లి ఏండ్ల తార బడి కాపాడుకుంటూ వస్తున్న రాజా బంగ్లా ప్రహరీ స్ధలం కిరికిరిలో ఉంది.

అది ప్రభుత్వ స్థలం అంటూ అక్కడ నిర్మాణం చేసుకుంటున్న ప్రజలకు జూపల్లి ఒక శ్రేయోభిలాషిగా సూచనలు ఇస్తూ వచ్చారు. కొందరు అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాణం చేసుకుంటున్న వాళ్లు కోర్టు లావాదేవీలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోకుండా చేసిన నాయకుడిగా ఈ చర్యతో ఆయన  నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. ఈ విజయం సాధించడానికి ఆయన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. జూపల్లి చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి సత్యం న్యూస్ తోడుఅయింది.

ప్రతి అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. రాజా వారి ఆరోపణలను కూడా జూపల్లి ఎదుర్కొన్నారు. రామాలయంలో బైఠాయించి జూపల్లి మాట్లాడిన మాటల్లో ఆయన నిజాయితీ తెలిసిపోయింది. శనివారం జరిగిన కొన్ని సంఘటనలు దీనికి నిదర్శనం. 20ఏండ్ల రాజకీయ చరిత్రలో తెలంగాణ కోస్సం ఉద్యమం చేశాను. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జూపల్లి వంశానికి, తల్లిదండ్రుల గౌరవాలకు, నియోజకవర్గ ప్రజలకు మచ్చ తెచ్చే విధమైన తప్పులను ఇంతవరకు చెయ్యలేదు. చేయను అని ఆయన చెప్పిన మాటలను చాలా మంది హర్షించారు.

కొందరు స్వార్థ పరుల లావాదేవిల స్వలాభల కోసం తనపై బురద జల్లే విధంగా, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు చేస్తే సహించనని రాష్ట మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కరాకండిగా మాట్లాడారు.  రెండు రోజుల క్రిందట కొల్లాపూర్ కోట ముందు భాగాన్ని తనకు రెండు కోట్ల రూపాయలకు అమ్మాలని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తనను అడిగారని, ఆ మాట కాదన్నందుకే కోటలో ప్లాట్లు వేసేందుకు అడ్డుపడుతున్నాడని కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు చేసిన ఆరోపణలకు అదే రోజు సాయంత్రం మాజీ మంత్రి జూపల్లి సవాలు చేసిన సంగతి తెలిసిందే.

శని ఆదివారాల్లో  రామాలయం, మాధవ స్వామి ఆలయంలో బహిరంగ చర్చకు రావాలని దేవునిపై ప్రమాణం చేయాలని జూపల్లి ఆయనను కోరారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు చేసిన సంగతి  అందరికీ తెలిసిందే. అదే మాట ప్రకారం శనివారం 12 గంటల సమయంలో  పట్టణ మెయిన్ రోడ్ మీదాగా తన అనుచర వర్గంతో ర్యాలీగా వెళ్లి ఆలయంలో బైఠాయించారు. రాజా ఆదిత్య లక్ష్మణరావు తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తక్షణమే రామాలయానికి వచ్చి దేవుడి ఎదుట ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు.

రాజావారు ప్లాట్లు అమ్ముకున్న సంగతిని తెలియచేశారు. కోర్టు వ్యవధిలో ఉన్న జిపి విషయంపై ప్రస్తావించారు. కొల్లాపూర్ అంటేనే గుర్తుకు వచ్చేది కోట. అలాంటి కోటను ప్రజా అవసరాల కోసం గత 70 సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. బతుకమ్మ తదితర పండుగలన్నీ కొల్లాపూర్ కోటలోనే జరుపుకుంటున్నాము. అలాంటిది రాజాగారు దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు. ప్లాట్లు చేసి అమ్ముకుంటే కొల్లాపూర్ కోట చుట్టూ నిర్మాణాలు  కనిపించకుండా పోతుంది.

గతంలో కోటకు సంబంధించిన బహిరంగ స్థలాన్ని వేరేవారు ఆక్రమించుకుంటుంటే దాన్ని కాపాడామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసం వివిధ మీటింగ్ లకు ఉపయోగిస్తున్న స్థలాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటానంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఆదివారం( నేడు) ఉదయం11గంటలకు పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్థలో రాజా వారి గురించి మరిన్ని నిజాలు తెలియచేస్తానన్నారు. ప్రజలు కార్యకర్తలు అనుచర వర్గం సమక్షంలో మాట్లాడుతానని చెప్పారు.

స్వార్థాలకు పాల్పడే వ్యక్తుల అసలు రంగు బయటపెడతానన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ యువనాయకులు నరసింహ్మ రావు, కోడేర్ ఎంపిపి కొండ రాధ ,మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, కేతేపల్లి రవి, వెంకట స్వామి, కొండూరు గోపాల్, శ్రీను, మాజీ ఎంపిపి నిరంజన్ రావ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూపల్లి రఘుపతి రావు, పసుపుల నరసింహ్మ, ఎండి ఎక్బాల్, బోరెల్లి మహేష్, గుమ్మకొండ రాంమేష్, ధర్మ తేజా, పిన్నాం శెట్టి బాలు, మద్యాల రాం దాస్, నాయిమ్, రెడీ సత్యం, రహీం, ప్రిన్స్ బాబా, పసుల వెంకటేష్, జి.శేఖర్, బాల స్వరూప్, విజయ్, సందీప్, దిలీప్, ఎండి ఫిరోజ్ ఖాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘అవధానానికి ఒకరోజు’.. ఏమైందో ?

Bhavani

తక్కువ స్థాయిలో జ్వరం వస్తే భయపడవద్దు

Satyam NEWS

రెవెన్యూ శాఖ అవినీతిపై ఇక కేసీఆర్ కొరడా

Satyam NEWS

Leave a Comment