30.7 C
Hyderabad
April 29, 2024 04: 02 AM
Slider శ్రీకాకుళం

డ‌ప్పు క‌ళాకారుల‌ను ఆదుకోవాలి

Dappu

కరోన మహమ్మారి వలన పూర్తిగా ఉపాధి కోల్పోయిన దళిత డప్పు కళాకారులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డప్పు భరోసా పథకం ద్వారా 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయాలని, పెన్షన్ నమోదు వెబ్సైట్ తక్షణమే ఓపెన్ చేయాలని, అర్హులైన డప్పు కళాకారులకురైల్వే, బస్ లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, అర్హులైన డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని శ్రీ‌కాకుళం దళిత డప్పు కళాకారుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

శ‌నివారం మందసలో హైస్కూల్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు డప్పుల‌తో బస్ స్టాండు మీదుగా రాజు గారి కోట మీదుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. గణేష్, డప్పు కళాకారుల సంఘం పలాస డివిజన్ కార్యదర్శి, తలగాన చంద్రశేఖర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో లక్డౌన్ విధించడంతో పెళ్లిళ్లు, సంబరాలు, జాతర‌లు, వారాలు, సభలు సమావేశాలు నిషేధించడంతో డప్పు కళాకారులు బ్రతుకులు పూర్తిగా సిద్ర‌మైంద‌న్నారు.

ఈ కాలంలో ప్రధాన ఏకైక ఆదాయ వనరుగాఉన్న డప్పు కళ పూర్తిగా దెబ్బతిన్నద‌ని, కరోన వలన చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి ఎన్నో రకాల పధకాలు ద్వారా ఆర్ధిక సహాయం చేస్తుందని, దళితులు ఓట్లుతో గద్దినెక్కిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత సంక్షేమం మర్చిపోవడం చాలా దుర్మార్గమని, దళిత డప్పు కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో అనేకచోట్ల దళితులు మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పొలీస్ యంత్రాంగం అగ్రకుల పెత్తందారులకు అనుకూలంగా కొమ్ముకాస్తూ కేసులు నీరుగారిస్తున్నారని తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమన రమేష్, దున్నశ్రీను, తమాడా సన్యాసిరావు సీపీఎంల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు, గురుబెల్లి కృష్ణారావు, గేదేల అప్పారావు, ఇప్పిలి తాతారావు, ఇప్పిలి పాపారావు, రాయి కృష్ణారావు, రేగి దానేశ్, బుసకల పరమేశ్వరరావు బీర సోమేశ్వరావు, తెప్ప లోకనాధం, ఇప్పిలి వీరన్న, గేదెల రాజు, తెప్ప ఢిల్లీరావు, ఇప్పిలి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్ ఇది..

Satyam NEWS

ముగ్గురు బ్యాటరీ దొంగల అరెస్టు

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో తిరగవద్దు అంటే వింటారా? వినరు…అందుకే…

Satyam NEWS

Leave a Comment