38.2 C
Hyderabad
April 29, 2024 21: 54 PM
Slider ముఖ్యంశాలు

లండన్ లోని థీమ్స్ నదిలా మురికి మూసీ

#mallubhatti

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ సమావేశానికి  రావడం సంతోషంగా ఉంది గర్వకారణంగా భావిస్తున్నాను. హాజరైన వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఏ రాష్ట్రంలో లేని భౌగోళిక వాతావరణం తెలంగాణలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఏ సీజన్ లో అయినా ఎంజాయ్ చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారికి భాష సమస్య ఉండదు. ఇక్కడ అన్ని రకాల భాషలు మాట్లాడుతారు అర్థం చేసుకుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా తెలంగాణ నా ప్రాంతం.. ఇది నా ఊరు అన్న భావనతో ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆరోగ్యాలు బాగు చేసుకుంటారు. ఐఐటి, త్రిబుల్ ఐటీ, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి గొప్ప యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచానికి అవసరమైన మానవ వనరులు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో దొరికే మానవ వనరులు ఏ రాష్ట్రంలోనూ లభించవు అన్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు,   కావాల్సినంత భూమి ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు.

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తూ తనను CII సమావేశానికి పంపినట్టు డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరిగా పారిశ్రామికవేత్తలకు తలుపులు మూసివేసే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్లోని మంత్రులందరూ 24 గంటల పాటు పారిశ్రామికవేత్తల కోసం సెక్రటేరియట్, వారి ఇళ్ల తరుపులు తెరిచే ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిసిపోయి ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక నగర రాజ్యాంగ, మిగిలిన జిల్లాలు సెమీ అర్బన్ వాతావరణంతో ఉంటాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఫార్మాసిటీ అంటే ఒకే చోట 30000 ఎకరాల్లో ప్రణాళికలు రూపొందించారు. అది ప్రజల ఆరోగ్యం రీత్యా సరైన విధానం కాదన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వసతులతో కూడిన ఫార్మా విలేజిలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. Orr, RRR ల మధ్య TEXTILES, ఐటీ, డెయిరీ క్లస్టర్ లు అభివృద్ధి చేసే ప్రణాళికలు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. సామాన్యుడు ఇంటి స్థలం, ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులతో శాటిలైట్ టౌన్షిప్పుల నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. 20- 30 ఏళ్ల క్రితం ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ కూకట్పల్లి నిర్మాణం జరిగింది. అది నిర్మాణం జరగడంతోనే వేలాది మందికి ఆశ్రయం ఏర్పడి పరిశ్రమలు హైదరాబాదులో నిలదొక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఈ రంగాలపై ఆసక్తి చూపెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ మనది మనందరిదీ. సంపద సృష్టించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుంది. తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి గా చూస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు  గ్యారెంటీ ల అమలులో మహాలక్ష్మి పథకం కింద మహిళల అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్ ఇచ్చాం. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగం మధ్యన చాలా గ్యాప్ ఉన్నందున డెయిరీ ని డెవలప్ కు మంచి అవకాశాలు ఉన్నాయి.

స్వచ్ఛమైన పాలను అందించగలిగే విధంగా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలు చేసిన వారం అవుతాము. అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న MSME(సూక్ష్మ చిన్న తరహా) పరిశ్రమలను  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ ఉండే జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, కందులు అంటే ఉత్పత్తులు భారీగా వస్తాయి. ఆ ఉత్పత్తులకు అనువైన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా మూసీ నది డ్రైనేజీ కాలువగా మారింది. మూసిని పునర్ జీవింప చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది.

ఈసీ, మూసి నదుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటితో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా హైదరాబాద్ కు వస్తున్న గోదావరి, కృష్ణ  నదుల నీళ్లను మూసికి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీటిని పారించి  మూసి ప్రక్షాళన చేయబోతున్నాం. లండన్ లోని థేమ్స్ నదిని మోడల్గా తీసుకొని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మూసి పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ తదితర ఆస్తులను పిపిపి(పబ్లిక్, ప్రైవేట్) మోడల్ లో అభివృద్ధి చేయనున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ సిఐఐ విభాగం రూపొందించిన ఐదు శ్వేత పత్రాలను డిప్యూటీ సీఎం విడుదల చేశారు.

కార్యక్రమంలో సిఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, ప్రత్యేక అతిధిగా సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ కమల్ బాలి, సీఐ ఐ తెలంగాణ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడేందుకు లక్షకు పైగా మొక్కలు నాటిన ప్రగతి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జి వి కె రావు తో పాటు మరో నలుగురికి జ్ఞాపికలు అందించి డిప్యూటీ సీఎం అభినందించారు.

Related posts

Ice Casino-die Besten Legitimen Spezielle Casinos

Bhavani

ఆండ్రలో దొంగత‌నం ప‌ని ఆక‌తాయిల ప‌నే….!

Satyam NEWS

విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ కు విస్తృత ఏర్పాట్లు

Bhavani

Leave a Comment