38.2 C
Hyderabad
April 27, 2024 18: 02 PM
Slider ప్రత్యేకం

ఎలివేటేడ్​ కారిడార్లకు కేంద్రం అనుమతి

#revanthreddy

హైదరాబాద్‌‌_ కరీంనగర్  రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇటీవలే ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను కలిసి డిఫెన్స్​ భూముల మీదుగా ఎలివేటేడ్​ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్​ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి శామీర్​పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

Related posts

అత్యాచారం కేసులో మసీదు హఫీజ్ కు బెయిల్ నిరాకరణ

Satyam NEWS

15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

Satyam NEWS

ఆత్మహత్యా యత్నం చేసుకోబోయిన తల్లి బిడ్డలు

Satyam NEWS

Leave a Comment