29.7 C
Hyderabad
May 3, 2024 04: 55 AM
Slider హైదరాబాద్

బీజేపీ ని దేశమంతటా చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

#CPI Telangana

నిరంకుశ ప్రజా వ్యతరేక బీజేపీ ని దేశమంతటా చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్, ఈ.టి. నరసింహ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు దేశాన్ని వినాశనం వైపు నెట్టుతున్నాయని, నియంతృత్వ మోడీ పాలనను వచ్చే ఎన్నికల్లో అంతం చేయాలనీ,

“బీజేపీ హటావ్- దేశ్ బచావ్” కోరుతూ ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ చౌరస్తా నుండి ఉస్మాన్ గంజ్, సిద్ది అంబర్ బజార్, ఆఫ్జాల్ గంజ్, బేగం బజార్, ఫీల్ ఖానా ప్రాంతాల్లో శనివారం పాదయాత్ర నిర్వహించింది.

సిపిఐ శ్రేణులు ఇంటింటికి, వ్యాపార సముదాయాలు తిరిగి కరపత్రాలు అందజేసి కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతరేక విధానాలను ప్రజలకు వివరించి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడించి దేశాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా వి.ఎస్. బోస్ మాట్లాడుతూ దేశంలోని సామాన్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి మాత్రం ప్రజలను విభజించడంపైనే ఉందని, బీజేపీ ప్రభుత్వ విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని తెలిపారు.

ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడి ఎమర్జెన్సీ కంటే దారుణం అని దీనిని ప్రజలు గమనించాలని అయన కోరారు. ప్రధాని మోడీ తీసుకువచ్చిన రైతు, కార్మిక, ప్రజా వ్యతరేక నిరంకుశ నల్ల చట్టాలతో దేశ ప్రజల మెడకు ఉచ్చు మరింత బిగుసుకుందని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం అణచివేత విధానాలతో ప్రజల గొంతు నొక్కుతుందని అయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని వి.ఎస్.బోస్ పిలుపునిచ్చారు.

ఈ.టి. నరసింహ మాట్లాడుతూ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశమంతా దోపిడీకి గురవుతోందని, కేవలం అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేతలే లాభపడుతున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం బూటకపు వాగ్దానాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆకలి, పేదరికంతో ప్రజలు తల్లడిల్లుతున్నారని అయన ఆందోళన వ్యక్తం చేసారు. మోడీ ప్రభుత్వ హయాంలో సమాజంలోని అన్ని వర్గాలు దాడులను ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా

ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు మరియు మహిళలు తీవ్రంగా దెబ్బతింటున్నారని, బీజేపీ మంత్రులు, ఎంపీ లు, ఎమ్యెల్యేలు బరితెగించి మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారని అయన ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదని, ప్రజాస్వామ్య, లౌకిక మరియు సామ్యవాద మన దేశాన్ని పరిరక్షించుకోవడానికి దేశవ్యతిరేక, అప్రజాస్వామిక బీజేపీని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం నుంచి గద్దె దించడమే కర్తవ్యంగా ప్రజలు భావించి ఓడించాలని ఈ.టి. నరసింహ విజ్ఞప్తి చేసారు.

సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి విషయంలో కెసిఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని, మోసపూరిత హామీలు ఇవ్వడం, ఆర్బాటంగా శంకుస్థాపనలు చేయడంతప్ప అభివృద్ధి పనులు ఏమి జరగడంలేదని ఆరోపించారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో జిహెచ్ఏంసి ఫుర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ పాతబస్తీలో అభివృద్ధి జరగకపోవడానికి ఎంఐఎం కారణమని ఆమె తెలిపారు.

పాతనగరంలో కొత్తనగరంలాగా అభివృద్ధి చేస్తామని, మెట్రో రైల్ పనులను ప్రారంభిస్తామని, రహదారుల విస్తరణాలు, డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని మంత్రి కేటీర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి పాతనగరంలో అభివృద్ధి చేపట్టాలని ఎస్. ఛాయాదేవి డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం, సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్ గౌడ్, నిర్లేకంటి శ్రీకాంత్, కంపల్లి శ్రీనివాస్, సిపిఐ నగర నేతలు గ్యార నరేష్, బైరగోని రాజు గౌడ్, ఆరుట్ల రాజ్ కుమార్, ఒమర్ ఖాన్, లతీఫ్, కొమురెల్లి బాబు, సిహెచ్. జంగయ్య, జె. కుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడలో బాలికపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

దమ్ముంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించుకోండి

Satyam NEWS

గ్రాండ్ గా మార్చి 3 న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచిగాడి పెళ్లి”

Satyam NEWS

Leave a Comment