29.7 C
Hyderabad
May 7, 2024 05: 12 AM
Slider ప్రత్యేకం

అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ

#delhi

క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లను అధిగమించి రాజధాని ఢిల్లీ చాలా తీవ్రమైన కలుషిత నగర విభాగంలో చేరింది.
ప్రతి సంవత్సరం చలికాలంలో దట్టమైన పొగ మంచు మరియు విపరీతమైన చలిగాలులు మరియు నిర్మాణాల ద్వారా వెలువడే దుమ్ము, వాహనాల ఉధ్గారాలు మరీ ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో పంట పండిన తరువాత వచ్చే గడ్డిని కాల్చడం ద్వారా వచ్చే పొగ ఢిల్లీ నగరంలోని 20 మిలియన్ల మంది ప్రజలకు శ్వాసకోస వ్యాధులకు కారణం అవుతుంది అని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భముగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రి వాల్ ఒక ప్రకటన చేశారు . ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. అలాగే పిల్లలు, వృద్దులు ఇళ్ల నుండి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ముఖ్యంగా డీజిల్ తో నడిచే వాహనాలు అనవసర సరుకులను రవాణా చేయకుండా నిషేధించారు ఢిల్లీలో అలాగే వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చే వాటికి సరి – బేసి సంఖ్యలో అనుమతినిచ్చారు . అంటే ఒకరోజు మొత్తం కూడా సరి సంఖ్య నెంబర్లు కలిగి ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపైకి వస్తాయి. మరుసటి రోజు బేసి సంఖ్య వాహన నెంబర్లు ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపైకి వస్తాయి. అంటే ఒక రోజులో 50% వాహనాలు సెలవు తీసుకుంటాయి.

ఢిల్లీలో నూతన నిర్మాణాలను చేపట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు 50 శాతం మంది ఇంటినుండే విధులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలియజేశారు. ప్రైవేటు భాగస్వామ్య సంస్థలు కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సంకలనం చేసిన డేటా ప్రకారం న్యూఢిల్లీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది.

Related posts

కోడెల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

Satyam NEWS

దళిత రత్న అవార్డుల ప్రధాన ఉత్సవం

Bhavani

శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment