40.2 C
Hyderabad
April 28, 2024 16: 12 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

#Mahashivratri Brahmotsavam

శ్రీశైలం మహా క్షేత్రంలో 11వ తేదీ నుండి 21 వ తేదీ వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని ఈవో లవన్న తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

11వ తేది ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 21వ న రాత్రి పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ముఖ్య కార్యక్రమాలు :

11.02.2023 – ధ్వజారోహణ,
12.02.2023 -భృంగివాహనసేవ,
13.02.2023 – హంసవాహనసేవ,
14.02.2023 – మయూరవాహనసేవ,
15.02.2023 – రావణవాహనసేవ
16.02.2023 – పుష్పపల్లకీసేవ
17.02.2023 – గజవాహనసేవ
18.02.2023 – మహాశివరాత్రి – ప్రభోత్సవం – నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక
రుద్రాభిషేకం – పాగాలంకరణ — స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
19.02.2023 – రథోత్సవం — తెప్పోత్సవం
20.02.2023 – యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
21.02.2023 – అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
పట్టు వస్త్రాల సమర్పణ :
11.02.2023 – శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం
13.02.2023 – శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం
14.02.2023 – ఉదయం — శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం
సాయంకాలం — తిరుమల తిరుపతి దేవస్థానం
15.02.2023 – రాష్ట్ర ప్రభుత్వం

Related posts

వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్

Bhavani

వంటరి మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

Satyam NEWS

కొల్లాపూర్ లో మైనర్ బాలికపై అత్యాచారయత్నం?

Satyam NEWS

Leave a Comment