38.2 C
Hyderabad
May 2, 2024 19: 49 PM
Slider సంపాదకీయం

సింగర్లు, యాంకర్లు, స్టార్లు ‘సైడ్ ఇన్ కం’ తోనే బతుకుతున్నారా?

#crazy uncles

సింగర్లు, యాంకర్లు, స్టార్లు డబ్బు ఎలా సంపాదిస్తారు? కార్లు బంగ్లాలు ఎలా కొంటారు? టీవీ ఛానెళ్లు, సినిమా నిర్మాతలు అంత ఎక్కువ పారితోషికం ఇవ్వకపోయినా ఇంత విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారు అనే అంశంపై ఇప్పటికే సామాన్య జనంలో పలు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి.

దీన్ని ఖరారు చేస్తూ సినిమాల్లోనే డైలాగులు వస్తుంటే….? సింగర్లు, యాంకర్లు, స్టార్లు విలాసవంతమైన కార్లు బంగ్లాలు ‘‘సైడ్ ఇన్ కం’’తో కొంటారట. దారుణమైన ఈ డైలాగ్ ఎవరో దారినపోయే దానయ్య చెప్పింది కాదు. ఒక టీవీ యాంకర్ నటించిన చిత్రంలోనిది.

ఇప్పటికే ఈ డైలాగ్ వైరల్ కావడంతో టీవీ యాంకర్లు, ఫీమేల్ సింగర్లు తలలు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 19న ఆ చిత్రం విడుదల కాబోతున్నది. ఇప్పటికే సెన్సార్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పలు అభ్యంతరకరమైన డైలాగ్ లు ఉన్నాయని ఆ చిత్రం ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతున్నది.

మహిళలపై వ్యంగ్యమైన డైలాగ్ లు ఉన్న ఈ చిత్రం ట్రైలర్ లు విడుదలై మూడు రోజులు అవుతున్నా మహిళా సంఘాలు ఏవీ కూడా దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. ‘క్రేజీ అంకుల్స్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం ముగ్గురు నడివయస్కులు సంసార సుఖం కోసం ఒక యువతి వెంటపడే కథ అని టీజర్స్ చూస్తే అర్ధం అయిపోతుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అన్నీ కూడా ద్వంద్వార్దాలతోనే నిండి ఉన్నాయి. ‘మా వైఫ్ లు తాజ్ మహల్ ఒక్కటే…. చూడ్డానికి తప్ప ఎక్కడానికి పనికిరావు’ అంటూ వచ్చే డైలాగ్ లు ఈ చిత్రంలో చాలా ఉన్నట్లే కనిపిస్తున్నది. గుడ్ సినిమా గ్రూప్ అనే బ్యానర్ పెట్టుకున్న నిర్మాతలు ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు ప్రయోగిస్తున్నారో అర్ధం కావడం లేదు.

సింగర్లు, యాంకర్లు, స్టార్లు సైడ్ ఇన్ కం తోనే ఆస్తులు సంపాదిస్తున్నారని చెప్పడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కానీ ఈ విషయంపై మహిళా సంఘాలు ఇప్పటి వరకూ ఎలాంటి చొరవ తీసుకోలేదు. ‘‘హీరోయిన్ల కంటే వాళ్ల పిఏలు ఎక్కువ సంపాదిస్తున్నారు’’ అంటూ ఈ చిత్రంలో ఒక క్యారెక్టర్ వేసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నోటి నుంచి వ్యంగ్యమైన డైలాగ్ లు రావడం మరింత ఎబ్బెట్టుగా ఉంది.

సినీ, వినోద పరిశ్రమలోని వారిని కించపరుస్తూ ‘‘సైడ్ ఇన్ కం’’ తో బతుకుతున్నారని అనడం పెద్ద సాహసమే. అలాంటి చట్టవిరుద్ధమైన ఆదాయంతోనే యాంకర్లు, సింగర్లు, సినీ స్టార్లు బతుకుతున్నారని చెప్పడమే తీవ్ర అభ్యంతరకరం. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు మళ్లీ మొదలవుతున్నాయనే సంతోషం ఒక వైపు ఉండగానే ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో సినిమాలు రావడం దురదృష్టకరం.

క్రేజీ అంకుల్స్ చిత్రంలో పోసాని కృష్ణ మురళితో చెప్పించిన డైలాగ్ లు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయి. భార్యల్ని గుప్పిటిలో ఉంచుకోవాలని చెప్పడాన్ని మహిళా సంఘాలు ఎలా తీసుకుంటాయో చూడాలి.

శ్రీముఖి అనే టీవీ యాంకర్ ను తీసుకుని ఇలా సింగర్లు, యాంకర్లు, హీరోయిన్లపై అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం మాత్రం ఖండించాల్సిందే.

ఇప్పటికే వైరల్ అయిన ఈ చిత్రం టీజర్లు ఇంకా మహిళా సంఘాలు చూడలేదా? లేక మనకెందుకులే అని ఊరుకున్నారో అర్ధం కావడం లేదు.

Related posts

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

అలుపెరుగని బాటసారమ్మ!

Satyam NEWS

డబుల్ బెడ్ రూమ్ రిటర్న్ ఇచ్చిన ఫర్విన్ మంత్రి అభినంద‌న‌

Sub Editor

Leave a Comment