38.2 C
Hyderabad
May 5, 2024 22: 07 PM
Slider ఖమ్మం

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా

#khammam

పేద, సామాన్య ప్రజలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పత్రాలను భక్త రామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ పత్రాల పంపిణి చేశారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పేదల సొంతింటి కలనెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు మన సీఎం కేసీఆర్‌ అని,రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్  ఆకాంక్ష అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింప జేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహలక్ష్మి పథకమని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని తెలిపారు.తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం  అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం గా ఉందని, బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.మళ్ళీ ఇలాంటి పథకాలు మనకు పూర్తి స్థాయిలో అందాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంను గెలిపించుకోవాలని కోరారు.

Related posts

రివర్స్ గేర్ :కెటిఆర్ కారు ను అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Satyam NEWS

ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్న నరేంద్ర మోదీ

Satyam NEWS

అమ్మాయిలు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

Satyam NEWS

Leave a Comment