సరదా గా బెంజ్ కారును నడుపుకుంటూ వచ్చిన రాష్ట్ర మంత్రి కె టి రామారావు ని ఓ ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. నిట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగిన మంత్రి కేటీఆర్ మడికొండ ఐటీ కంపెనీల వద్దకు వెళ్లే సమయంలో డ్రైవర్ రాముడిగా మారిపోయారు.
కాన్వాయ్‌లోని వెహికల్ లో కాకుండా, సైయెంట్ కంపెనీ ఓనర్ బీవీ మోహన్‌రెడ్డి బెంజ్ కారును ఆయనే స్వయంగా నడిపారు. అయితే అందులో మంత్రి ఉన్నారని తెలియక ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సదరు మంత్రి ప్రైవేట్ కారును నిలిపివేశాడు.పాపం ఆయా పోలీసు ఆ తోవలో వెళ్లే రాష్ట్ర మంత్రి కె టి రామారావు కాన్వాయ్ కి ఇబ్బంది కలగా కూడా వద్దనే ఉద్దేశ్యం తో కాన్వాయి కంటే ముందే వస్తున్నాకె టి ఆర్ కారు ను ఆదుర్ధాగా నిలిపి వేశారు.
దీనితో అక్కడ కొంతసేపు హైడ్రామా నడిచింది.చివరకు యూన్నతాధికారుల జోక్యం తో వివాదం సద్దుమణిగింది.ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా సదరు మంత్రి కె టి ఆర్ రాక కోసమే ట్రాఫికు ని క్లియర్ చేయడం కొసమెరుపు.