23.7 C
Hyderabad
May 8, 2024 03: 38 AM
Slider నల్గొండ

అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలి

#roshapati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శివారు లోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్దగల నిర్మాణమైన ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని, అధికారులు,అధికార పార్టీ ఎట్టకేలకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయం వారికి స్వాగతం పలుకుతూ హుజూర్ నగర్ తహశీల్దార్ నిజాయితీగా అర్హులైన వారికి ఇవ్వాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ లోని జంగాలగూడెంలో శీతల రోషపతి మాట్లాడుతూ గతంలో అనేక మార్లు ఇండ్ల కోసం దరఖాస్తులు తహశీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఉన్నారని,ఈనెల 4వ,తేదీకి చివరి సమయం కాకుండా  గతంలో ఉన్న దరఖాస్తులను కూడా ఇప్పుడు పరిధిలోకి తీసుకోవాలని కోరారు.

గత 30 నుండి 40 సంవత్సరాల పైగా  జంగాలగూడెంలో 60 కుటుంబాలకు పైగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి గుడిసెలు ఉన్న స్థలం లోనే పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అధికారులుని రోషపతి కోరారు.

హుజూర్ నగర్ పట్టణంలో ఇళ్లు లేని వారి కోసం అనేక సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేసిన చరిత్ర ఉన్నదని,కానీ ఈరోజు వరకు వారికి ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేదని,అర్హులైన ఇళ్లు లేని పేద ప్రజల తలరాతలు ఇప్పటివరకు మారలేదని,మరల ఎన్నికల కోడ్  రాకముందే అధికార పార్టీ చొరవతో అధికారులు తక్షణమే అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని శీతల రోషపతి కోరారు.

ఈ కార్యక్రమంలో జంగాల బాబు, హనుమంతు,లక్ష్మి,జానయ్య,పద్మ, రాములు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

నిరుత్సాహం వద్దు భవిష్యత్తు మనదే

Satyam NEWS

కాంగ్రెస్ ధర్నాకు అనుమతించిన న్యాయస్థానం

Bhavani

Leave a Comment