28.7 C
Hyderabad
May 6, 2024 00: 35 AM
Slider ముఖ్యంశాలు

విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు

#botsa

విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూ గుర‌జాడ‌లో విద్యా శాఖ మంత్రి బొత్సా  స‌త్య‌నారాయ‌ణ దాదాపు 8 కోట్ల అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు. ఇందులో 3.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్ కు మంత్రి బొత్స శంకుస్థాప‌న  చేసారు. జేఎన్టీయూ గుర‌జాడ ప్రాంగ‌ణంలో మూడు చోట్ల ఈ అభివృద్ది ప‌నుల‌ను మంత్రి విద్యా శాఖ మంత్రి బొత్స ప్రారంభించారు. జేఎన్టీయూలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచీ మంత్రి బొత్స‌..ఎక్కువ‌గా క‌ళాళాల విద్యార్ధినీనుల‌చే మ‌మేకం అవ్వ‌డం విశేషం.

అదీ కాకుండా క‌ళాశాల ప్రాంగణంలో మూడు చోట్ల నిర్మిత‌మైన ప‌లు భ‌వ‌నాల‌ను  మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యార్ధినీల‌చే కొబ్బ‌రి కాయ‌లు కొట్టించ‌డం విశేషం. తొలుత .9.55 కోట్ల వ్యయంతో పలు అకాడెమిక్ వసతుల కల్పనకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేసిన మంత్రి బొత్స అనంత‌రం 3.25 కోట్ల ఏ.ఐ.సి.టి.ఇ. నిధులతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.

అలాగే 1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన సివిల్, మెటల్లర్జి లేబొరేటరీలను ….3.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్ కు శంకుస్థాపన చేసారు…మంత్రి బొత్స‌. త‌ద‌నంత‌రం..కాన్ఫ‌రెన్స్ హాలులో జ‌రిగిన స‌భ‌లో మంత్రి బొత్స నారాయ‌ణ మాట్లాడారు. క‌ళాశాల‌ విద్యార్ధుల‌కు ఎయిమ్ తో ఓవ‌ర్ ఎయిమ్ కూడా చాలా అవ‌స‌ర‌మ‌ని ఈ సందర్బంగా అన్నారు. రాష్ట్రంలో చివరి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్ధులు 40 వేల మందికి ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల్లో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తున్నాం: విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

అలాగే ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం ఎం.ఓ.యు.లు చేసుకుంద‌ని… ఈనెల 16న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఇక ఇంటర్నషిప్ లో పాల్గొనే విద్యార్ధులకు స్టైఫెండ్ కూడా చెల్లిస్తామ‌ని…  మంత్రి బొత్స సత్యనారాయణ స్ప‌ష్టం చేసారు. ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే..  విశ్వవిద్యాలయ మాగజైన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. వెంకట సుబ్బయ్య, జిల్లా కలెక్టర్  ఎస్ నాగలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రో.జి. జయసుమ, ప్రిన్సిపాల్ కె.  కుమార్, ఇ.సి. సభ్యులు బి. రాజేష్, దుప్పల వెంకటరావు, డా. మజ్జి శశి భూషణరావులు పాల్గొన్నారు.

Related posts

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు

Satyam NEWS

74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

హ్యాట్సాఫ్ సునీల్: దివ్యాంగుడివైనా నీవే దేవుడితో సమానం

Satyam NEWS

Leave a Comment