38.2 C
Hyderabad
May 5, 2024 19: 37 PM
Slider ముఖ్యంశాలు

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

#puvvada

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 10, 26, 37, 39, 40, 42వ డివిజన్లలో రూ.2.10 కొట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ నగరాభివృద్ది లో చిత్తశుద్ధితో, నిజాయితీతో నిబద్ధతతో పని చేస్తున్నాని అన్నారు. ఇక్కడ ఎమ్మేల్యేగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఖమ్మంను నా ఇంటి లా భావించి, ఇక్కడ ప్రజలంతా నా కుటుంబ సభ్యులుగా భావించానని, అందుకే ఇన్ని కొట్లు నిధులు తీసుకొచ్చానన్నారు.

ఇక్కడ జరిగినన్ని పనులు మరెక్కడా జరగలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిధులు ఇప్పటికీ వరకు పాలించిన వారుఎవరైనా  తెచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ధరఖాస్తు చేసుకున్న  4వేల మందికి మొత్తం మంజూరు చేశాం. ఇప్పటికే 2వేల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు అందజేశామని,  ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి 4వేల మందికి Go.no.58 ద్వారా వారికే పట్టాలు ఇచ్చామని అన్నారు.

నగరంలో గతంలో 25వేల మందికి పెన్షన్ లు ఉంటే నేడు 78 వేల పెన్షన్స్ ప్రతి నెల అందిస్తున్నాం. ఇంత అభివృద్ది జరిగింది అంటే అది ప్రజలు కట్టె పన్నుల వల్ల మాత్రం కాదన్నారు. వచ్చే పన్నులు  కేవలం రూ.25 కోట్లు మాత్రమే కానీ ఇన్ని వేల కోట్ల నిధులు తేవడం వల్లే ఇంత ప్రగతి సాధ్యమైంది అంటే అది ప్రభుత్వ నుండి వచ్చిన అదనపు నిధుల వల్లేనని, అందరి కృషి వల్లే నేడు నేను ఇంత అభివృద్ధి చేయగలిగినం అంటే ఇక్కడ కార్పొరేటర్స్, వివిధ స్థాయిల చైర్మన్ లు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లేనన్నారు.

ఇదే అభివృది కొనసాగాలంటే మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వంకు ఓటు వేసి గెలిపించడం వల్లే సాధ్యమైతుంది. లకారం ట్యాంక్ బండ్ లో ఖమ్మంలో జరిగిన అభివృద్ది పనుల ప్రతిబింభాలతో కూడిన లేజర్ షో, డ్రోన్ షో లు నిర్వహిస్తున్నామని, అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుతున్న.  అందరి ఆశీర్వాదం తో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి రావాలని కోరుతున్న.. కేసీఅర్ గారిని మళ్ళీ గెలిపించాలని నే అందరిని కోరుకుంటున్నమన్నారు. అనంతరం గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

Related posts

దయనీయ స్థితిలో ఉన్న ముగ్గుర్ని ఆదుకున్న మానవ హక్కుల కమిషన్

Satyam NEWS

సెక్సీ స్టోరీ: తల్లిదండ్రులు, మికాయిలా ఓ రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

మహిళల రక్షణే ధ్యేయంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment